
15న వైఎస్ జగన్ పుష్కర స్నానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.
సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న తూర్పు గోదావరి జిల్లాకు విచ్చేయనున్నారు. జిల్లా లోని రాజమండ్రికి వైఎస్ జగన్ రానున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ శనివారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. ఆ రోజు జగన్ గోదావరిలో పుష్కర స్నానం ఆచరించనున్నారని వివరించారు. కాగా, ఈ నెల 14 నుంచి 25 వ తేదీ వరకూ గోదావరి పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే.