మాటల్లో పెట్టి.. రేటు కట్టి

Unemployeed Woman Complaint on Government Employee - Sakshi

హాసన్‌లో ప్రభుత్వ ఉద్యోగి పాడుబుద్ధి  

ఉద్యోగమిప్పిస్తానని ఫోన్‌లో వేధింపులు

మీ టూ అని గళమెత్తిన అజ్ఞాత యువతి

ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టింగ్‌

యశవంతపుర: మీటూ లైంగిక వేధింపుల ఆరోపణలు సినిమా రంగానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై అనేక మంది యువతులు మీ టూ అని గళమెత్తుతున్నారు. కర్ణాటకలోకి హాసన్‌ ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ యువతి ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకంపై మీటూ అంటూ సెల్ఫీ వీడియోను తీసి ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పోస్ట్‌ చేసింది. ఆ పోస్టు విస్తృతంగా షేర్‌ అవుతోంది.

ఉద్యోగమిప్పిస్తానని..  
బాధిత యువతి తన పేరును వెల్లడించకుండా.. తనను వేధించిన వ్యక్తి ఎవరో చాటిచెప్పింది. హాసన్‌ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కృష్ణేగౌడ ఉద్వోగం ఇప్పిస్తానంటూ నమ్మించి తన మొబైల్‌ నంబర్‌ను తీసు కుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. ముద్దుకు ఒక రేటు, పిలిచినప్పుడు వస్తే అడిగినంత డబ్బులు ఇస్తానంటూ తనపై ఒత్తిడి చేసిన్నట్లు గోడును వెళ్లబోసుకుంది. పత్రికలు, టీవీలో వస్తున్న మీటూ ఉద్యమం స్ఫూర్తితో తన బాధను వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపింది. కామాంధునిపై చర్యలకు జిల్లా ఎస్‌పీ ప్రకాశ్‌గౌడ సాయం కావాలని, కృష్ణేగౌడ లాంటి కీచకుడికి చట్టం ప్రకారం శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. రిటైరయ్యే వయస్సులోనున్న అతడు.. రూ.15 వేలు ఇస్తా, ఒక ముద్దు పెట్టించుకోవాలని తనను వేధించినట్టు ఆమె వెల్లడించింది.

నువ్వూ ఒక తండ్రివేనా?: గురుప్రసాద్‌పై భార్య ఆగ్రహం  
మీ టూను కొందరు నటీమణులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన దర్శకుడు గురుప్రసాద్‌పై అతని మొదటి భార్య ఆరతి విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల వయస్సున్న కూతురు, భార్యను అర్ధరాత్రి ఇంటి నుండి గెంటేసిన సంగతి మరిచావా అని ప్రశ్నించారు. ఒక తండ్రిగా ఆయన ప్రవర్తించలేదని, గురుప్రసాద్‌కు ఒక కూతురుందనే విషయం మరిచి మాట్లాడటం సరికాదన్నారు. ఇంటి నుంచి తనను గెంటివేస్తే ఎలాంటి గొడవ చేయకుండా బయటకు వచ్చానన్నారు. తండ్రిగా బాధ్యతలను నిర్వహించలేని గురుప్రసాద్‌ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. తాను విడాకులు తీసుకోవాలనుకున్నా ఆయన సిద్ధంగా లేరని చెప్పారు.   

సంగీతభట్‌ భర్త సైతం..  
యశవంతపుర: దర్శకుడు గురుప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను నటి సంగీతాభట్‌ భర్త సుదర్శన్‌ భట్‌ ఖండించారు. సంగీత ఇప్పుడు చిత్రరంగాన్ని వదిలేశారు. ప్రచారం కోసం మీటూ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top