బంగారు ఇస్త్రీపెట్టెలు

Gold smuggling in the name of Iron Boxes - Sakshi

దుబాయి నుంచి స్మగ్లింగ్‌ 

నాలుగు ఐరన్‌ బాక్సుల్లో 9.2 కేజీల బంగారం 

శంషాబాద్‌: బంగారం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నా.. అక్రమార్కులు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా దుబాయి నుంచి భారీఎత్తున బంగారాన్ని తీసుకు వచి్చన ఓ ప్రయాణికుడిని ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి  విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను కస్టమ్స్‌ అధికారులు అనుమానించారు.

అతడి వద్ద ఉన్న బ్యాగుల్లోని 4 ఇస్త్రీ పెట్టెలను విప్పిచూడగా అందులో కాయిల్స్‌ రూపంలో 9.2 కేజీల బంగారం బయటపడింది. బహి రంగ మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదు పులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top