ప్రేమించలేదని  యువతిపై కత్తితో దాడి..! | Attack with a knife on a girl | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని  యువతిపై కత్తితో దాడి..!

Jun 14 2018 1:26 PM | Updated on Aug 17 2018 2:56 PM

Attack with a knife on a girl - Sakshi

శ్రీనివాస్‌

జైపూర్‌(చెన్నూర్‌) : ప్రేమ పేరుతో ఏడాది కాలం పాటు వేధింపులకు పాల్పడడ్డ యువకుడు చివరకు తన ప్రేమను అంగికరించడం లేదన్న కసితో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మి–చంద్రయ్య దంతపలు చిన్నకుమార్తె మౌనిక(19) ఇంటర్‌  చదువుతోంది.

ఇదే గ్రామానికి చెందిన కామెర విజయ–బాపు దంపతుల చిన్నకుమారుడైన శ్రీనివాస్‌ ఇంటర్‌ వరకు చదివి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఏడాది కాలంగా శ్రీనివాస్‌ మౌనికను తన ప్రేమను అంగికరించాలని వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని మౌనిక తన కుటుంబసభ్యులకు తెలపడంతో కొంత కాలం క్రితం శ్రీనివాస్‌ను మందలించారు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. దీంతో కోపం పెంచుకున్న శ్రీనివాస్‌ బుధవారం సాయంత్రం కిరాణా దుకాణం వద్దకు వచ్చిన మౌనికపై కత్తితో దాడి చేశాడు.

కడుపులో పొడిచి చేతికి గాయం చేశాడు. స్థానికులు గమనించి మౌనికను 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్‌ సీఐ నారాయణనాయక్, ఎస్సై విజేందర్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. మౌనిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement