మహిళపై దాడి.. పోలీసులపై చర్యలు

5 Haryana Cops Suspended After For thrashing Woman With Belt - Sakshi

చండీగఢ్‌ : మహిళను బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టినందుకు గాను ఐదుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఫరిదాబాద్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసు అధికారులు.. ఓ మహిళపై దాడి చేశారు. బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు దీనిపై స్పందించారు. వీడియోలో ఉన్న అధికారులపై కేసు నమోదు చేయడమే కాక వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు హెడ్‌ కానిస్టేబుల్స్‌ని సస్పెండ్‌ చేయగా.. మరో ముగ్గురు స్పెషల్‌ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించారు.

అంతేకాక సదరు అధికారుల మీద ఆదర్శ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వీడియో సంవత్సరం క్రితం నాటిదని అధికారులు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top