ఎక్స్‌ పెన్స్ రేషియో అధికం... ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా?

Investments in Market Expert Advices - Sakshi

పరాగ్‌ పరీక్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ కాకుండా అంతర్జాతీయంగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఇంకా ఏమైనా ఉన్నాయా ?  అసలు మన ఫండ్స్‌కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం, అనుమతులు ఉన్నాయా? విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమాలు ఎలా ఉంటాయి? ఈ పరాగ్‌ ఫండ్‌కు సంబంధించిన డైరెక్ట్‌ ప్లాన్  ఎక్స్‌పెన్ ్స రేషియో అధికంగా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎక్స్‌పెన్ ్స రేషియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలా?      –రవీందర్‌ జైన్ , సికింద్రాబాద్‌  
పరాగ్‌ పరీక్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే అనుమతి ఉంది. తన కార్పస్‌లో 35 శాతం మేర విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈ ఫండ్‌కు ఉంది. గతంలో కూడా ఈ ఫండ్‌ తన కార్పస్‌లో 20–25 శాతం మేర విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసింది. ఇలా విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి æ అనుమతులు ఉన్న మరో రెండు, మూడు ఫండ్స్‌ కూడా ఉన్నాయి. అయితే వీటితో పోల్చితే ఈ పరాగ్‌ ఫండ్‌ నిరంతరాయంగా విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఇక ఈ ఫండ్‌కు సంబంధించి పన్ను నిబంధనలు ఇతర ఈక్విటీ ఫండ్స్‌ పన్ను నిబంధనలుగానే ఉంటాయి. ఈ ఫండ్‌ ఎక్స్‌పె¯Œ ్స రేషియో 1.5 శాతంగా ఉంది. ఇది మరీ ఎక్కువేమీ కాదని నా అభిప్రాయం. తన నిర్వహణ ఆస్తులు పెరిగితే, ఎక్స్‌పెన్స రేషియోను తగ్గిస్తానని తన ఆఫర్‌ డాక్యుమెంట్‌లో పరాగ్‌ ఫండ్‌ పేర్కొంది. ఎక్స్‌పె¯Œ ్స రేషియోకు సంబంధించిన పన్ను నిబంధనలను ఇటీవలే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ సవరించింది. ఈ మేరకు ఎక్స్‌పెన్ ్స రేషియోలో త్వరలోనే ఈ ఫండ్‌ మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంత కాలం ఎదురు చూడండి. ఇక ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఎక్స్‌పెన్ ్స రేషియో ను పరిగణనలోకి తీసుకోవలసిందే. అయితే ఎక్స్‌పె¯Œ ్స రేషియో అధికంగా ఉందన్న ఒక్క కారణంగా ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలను వాయిదా వేయడం సరికాదు. డెట్‌ ఫండ్స్‌ విషయంలో ఎక్స్‌పెన్ ్స రేషియో చాలా ముఖ్యమైన అంశం. ఈ ఫండ్స్‌ రాబడులు అధికంగా వచ్చే అవకాశాలు లేనందున పరిమిత ప్రభావం చూపే ఎక్స్‌పె¯Œ ్స రేషియో డెట్‌ ఫండ్స్‌ విషయంలో కీలకమైన అంశమే. అయితే ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు అధికంగా వస్తాయి. కాబట్టి, ఎక్స్‌పె¯Œ ్స రేషియోను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. 

వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది సరైన సమయమేనా? మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి పన్ను ఆదాయం భారీగానే వస్తుందా?      –కిరీటి, విజయవాడ  
వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే, చాలా ఓపిక కావాలి. వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇప్పటికైతే సరైన సమయం రాలేదని చెప్పొచ్చు. వాల్యూ ఫండ్సే కాదు, ›గ్రోత్‌ ఫండ్స్‌ల్లో కూడా ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది  సరైన సమయం కాదు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగుండి, నికర లాభాలు మెరుగుపడితేనే, కంపెనీల షేర్లు పెరుగుతాయి. అప్పుడు మాత్రమే గ్రోత్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇప్పుడు సరైన సమయం మాత్రం కాదు. ఈ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే, కంపెనీలన్నీ సమతూకంగానే ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత మొత్తాన్ని వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సముచితమే.   ప్రస్తుతానికైతే మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లభించదనే చెప్పవచ్చు. 2018, íఫిబ్రవరి నుంచి చూసినా, మ్యూచువల్‌ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలు.. పన్ను చెల్లించాల్సిన స్థాయిలో రాలేదని చెప్పొచ్చు. అందుకని ప్రభుత్వానికి ఫండ్స్‌ లాభాలపై విధించే మూలధన లాభాల పన్ను పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. 

నా వయస్సు 50 సంవత్సరాలు. రిటైర్మెంట్‌ కోసం ఇప్పటిదాకా ఎలాంటి పొదుపు, మదుపు చేయలేదు. నేనే 65 లేదా 70 ఏళ్ల వరకూ పనిచేయగలను. నా రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి?      –ఫయాజ్, విశాఖపట్టణం  
రిటైర్మెంట్‌ అవసరాల కోసం సాధారణంగా 30 ఏళ్ల నుంచే ఇన్వెస్ట్‌ చేయడం ఆరంభించాలి. రిటైర్మెంట్‌ అనేది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లా¯Œ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఇక మీ విషయానికొస్తే, మీకు ఎంత సాధ్యమైతే అంత ఇన్వెస్ట్‌ చేయండి. ఏదైనా ఈక్విటీ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్‌ ఫండ్‌ను గానీ ఎంచుకోండి. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే సొమ్ములను ఇతర అవసరాల కోసం వినియోగించవద్దు. ఇప్పటి నుంచి మీరు మరో పది పదిహేనేళ్లు పనిచేయగలరు అనుకుంటున్నారు. కాబట్టి, తర్వాతి 10–15 ఏళ్ల అవసరాల కోసం ఇప్పటి నుంచి 10–15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయండి. ఫండ్స్‌ల్లో సిప్‌ విధానంలో పదేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులే వస్తాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top