విజన్ ప్యారడైజ్.. | he projects to buyers at affordable prices | Sakshi
Sakshi News home page

విజన్ ప్యారడైజ్..

Oct 11 2014 12:52 AM | Updated on Sep 2 2017 2:38 PM

విజన్ ప్యారడైజ్..

విజన్ ప్యారడైజ్..

నగరానికి చేరువలో, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ.. అందుబాటు ధరల్లో ఉండే ప్రాజెక్ట్‌లను కొనుగోలుదారులు ఆదరిస్తారనడంలో సందేహం లేదు.

వరంగల్, బెంగళూరు హైవేల్లో పలు ప్రాజెక్ట్‌లు      
విజన్ ఇండియా డెరైక్టర్ ఎంఎస్ నాయుడు

సాక్షి, హైదరాబాద్: నగరానికి చేరువలో, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ.. అందుబాటు ధరల్లో ఉండే ప్రాజెక్ట్‌లను కొనుగోలుదారులు ఆదరిస్తారనడంలో సందేహం లేదు. అచ్చం అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుట్టింది విజన్ ఇండియా. ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి జీవం పోస్తున్న వరంగల్, బెంగళూరు హైవేలపై పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. మరిన్ని వివరాలు విజన్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి. డెరైక్టర్ ఎంఎస్ నాయుడు మాటల్లోనే..

పజలు తమ కష్టార్జితాన్నంతా ధారపోసి, ఎంతో నమ్మకంగా పెట్టుబడి పెడతారు. అందుకే ‘రేపటి ప్రపంచాన్ని ఈ రోజే నిర్మిద్దాం’ అనే నినాదంతో కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచుతూ అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనే ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగానే పారిశ్రామిక హబ్‌గా పేరొందిన బెంగళూరు హైవేలోని కొత్తూర్‌లో 18.5 ఎకరాల్లో ‘విజన్ ప్యారడైజ్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. 150 - 650 గజాల మధ్య మొత్తం 208 ఓపెన్ ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుతున్నాం.

ప్రాజెక్ట్‌కు అతి దగ్గర్లో డీఎల్‌ఎఫ్ టౌన్‌షిప్, సింబయోసిస్ యూనివర్సిటీ, జార్జ్‌టెక్ అమెరికన్ యూనివర్సిటీ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టీఐఎస్‌ఎస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) వంటి ప్రతిష్టాత్మక సంస్థలుండటంతో ఈ ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చెందింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ను ఆనుకొనే వందల ఎకరాల్లో జాన్సన్ అండ్ జాన్సన్, పీ అండ్ డబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. దీంతో సమీప భవిష్యత్తులో కొత్తూర్ ప్రాంతంలో వేల కుటుంబాలు నివాసం ఏర్పరుచుకోనున్నాయన్నమాట. 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి, షాద్‌నగర్ పట్టణాలకు, అరగంటలో గచ్చిబౌలికి చేరుకునేలా రవాణా సదుపాయలున్నాయి.

ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 3 నెలల కాలంలోనే 50 శాతం విక్రయాలు జరిగిపోయాయంటే ఇక్కడి గిరాకీ, భవిష్యత్తు అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు.

త్వరలోనే ఇదే ప్రాంతంలో విజన్ ప్రైడ్ పేరుతో మరో 50 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. ఫేజ్-1 నవంబర్‌లో, ఫేజ్-2ను జనవరిలో ప్రారంభిస్తాం. ఫేజ్-1లో 25 ఎకరాల్లో మొత్తం 300 ఓపెన్ ప్లాట్లొస్తాయి. విజన్ ప్యారడైజ్‌లో కల్పిస్తున్న అన్ని రకాల వసతులతో పాటు పార్క్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, క్లబ్ హౌజ్‌లుంటాయి.

త్వరలోనే షాద్‌నగర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఆనుకొని 70 నుంచి 100 ఎకరాల్లో మరో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం. ఇందులో క్లబ్ హౌజ్‌తో పాటు ఆధునిక స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలెన్నో కల్పిస్తాం.

వరంగల్ హైవేలోని ప్రాజెక్ట్ విషయానికొస్తే.. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో వరంగల్ జాతీయ రహదారి ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాం. విజన్ కౌంటీ పేరుతో 15 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. 200- 500 గజాల మధ్య ప్లాట్ల విస్తీర్ణం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement