
రుణ రేటును తగ్గించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణ రేటును తగ్గించింది.
న్యూఢిల్లీ: యాక్సిస్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణ రేటును తగ్గించింది. దీని ప్రకారం ఏడాది కాలానికి సంబంధించి రుణ రేటు ఐదు బేసిస్ పాయింట్లు (0.05%) తగ్గింది. దీనితో ఈ రేటు 9.30% నుంచి 9.25%కి దిగింది. ఇక రెండేళ్లకు సంబంధించి ఈ రేటు 9.40% నుంచి 9.35%కి తగ్గింది. మూడేళ్ల వ్యవధికి సైతం రేటు 9.45% నుంచి 9.40%కి దిగింది. గురువారం నుంచే తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.