చెరుకులపాడులో దుశ్చర్య | ysrcp party flag pole remove tdp leaders | Sakshi
Sakshi News home page

చెరుకులపాడులో దుశ్చర్య

Nov 27 2017 7:40 AM | Updated on Jul 25 2018 4:53 PM

ysrcp party flag pole remove tdp leaders  - Sakshi

జెండా పైపును కోసివేసిన దృశ్యం

వెల్దుర్తి: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  చెరుకులపాడులో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత శనివారం భారీ జనసందోహం మధ్య ఆవిష్కరించిన పార్టీ జెండాపై కొందరు తమ ప్రతాపం చూపించారు. 24గంటలు గడవకుండానే జెండా కర్ర(ఐరన్‌పైపు)ను కోసేసి పైశాచిక ఆనందం పొందారు. ఆదివారం ఉద యం నాటికి జెండా కర్రతో జెండాను కనిపించకుండా చేశారు. బెయిల్‌పై వచ్చి చెరుకుపాడుతోపాటు సమీప గ్రామాలు తొగర్చెడు, కొసనాపల్లెల్లో ఉంటున్న నారాయణరెడ్డి హత్య కేసు నిందితుల పనేనని చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

తమ ప్రత్యర్థులే ఇలాంటి చిల్లర పనులు చేయిస్తున్నారని పార్టీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి అనుమానిస్తున్నారు. గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఉన్నా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడడం దురదృష్టకరమని, విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సర్పంచ్‌ అపర్ణ, ఎంపీటీసీ సభ్యురాలు సువేదమ్మ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement