ఫీజు రీయింబర్స్‌ చేయలేదు | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌ చేయలేదు

Published Mon, Sep 17 2018 6:40 AM

Politechnic Student Share About Fees Reimbursement - Sakshi

విశాఖపట్నం :మాది ఆనందపురం మండలం శొంఠ్యం గ్రామం. నేను గిడిజాలలోని ఓ ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రానిక్‌ డిప్లమో కోర్సులో చేరాను. ఏడాదికి రూ.25వేలు ఫీజు చెల్లించాలి. ఏడాదికి రూ.15వేలు చొప్పున మొదటి రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. నా తల్లిదండ్రులు దీనికి అదనంగా అప్పు చేసి మరో రూ.10 వేలు చెల్లించడంతో డిప్లమో పూర్తి చేశా. తరువాత దాకమర్రిలో ఓ ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు వచ్చింది. ఫైనలియర్‌ ఫీజు రీయింబర్స్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో మొత్తం ఫీజు చెల్లిస్తే గానీ సర్టిఫికెట్‌ ఇవ్వబోమని యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో అప్పులు చేసి నగదు చెల్లించాం. నేటికి కూడా ఫీజు రీయింబర్స్‌ విడుదల చేయలేదు. ఈ సమస్యను జగనన్నకు చెప్పుకున్నా..– హేమలత, ఇంజినీరింగ్‌ విద్యార్థిని

Advertisement
Advertisement