వైఎస్ జగన్‌కు లోకేశ్‌ శుభాకాంక్షలు | Nara Lokesh Birthday Wishes to AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌కు లోకేశ్‌ శుభాకాంక్షలు

Dec 21 2019 12:11 PM | Updated on Dec 21 2019 12:21 PM

Nara Lokesh Birthday Wishes to AP CM YS Jagan - Sakshi

నారా లోకేశ్‌ (ట్విటర్‌ ఫొటో)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో వైఎస్‌ జగన్‌ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శనివారం ట్వీట్‌ చేశారు.

విశ్వసనీయతకు మారు పేరు జగన్‌: దేవినేని అవినాష్‌
ఉత్తమ నాయకత్వం, విలక్షణ దార్శనికత కలిగిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు. పుట్టినరోజు సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘మాట తప్పని మరియు మడమ తిప్పని వ్యక్తిత్వం, విశ్వసనీయతకు మారు పేరు, ప్రజా సంక్షేమ పథకాలతో అందరి కష్టాలను దూరం చేస్తోన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు’ అని అవినాష్‌ ట్వీట్‌ చేశారు. వీడియో సందేశంతో మరో ట్వీట్‌ పెట్టారు.

సంబంధిత వార్తలు...

సంక్షేమ సారథి.. జననేత జగనన్న

రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

సీఎం జగన్‌ ఆకాంక్ష అదే: విజయసాయిరెడ్డి

సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement