ఏపీపీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి, అర్హులకు అన్యాయం చేశారని ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఏపీపీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి, అర్హులకు అన్యాయం చేశారని ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపిపిఎస్ సి అవకతవకలు అన్నింటినీ బయటపెట్టారు. వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన దాదాపు 8 వేల పోస్టుల్లో నిబంధనలను తుంగలోతొక్కారని చెప్పారు. పరిక్షల అనంతరం తప్పుడు 'కీ'లు ఇచ్చారని, వాటితోనే అనర్హులను ఎంపిక చేసి, అర్హులైన వారికి అన్యాయం చేశారన్నారు.
2011 జులై నుంచి 2012 డిసెంబరు వరకు అనేక తప్పిదాలు జరిగాయని తెలిపారు. వాటిని తాను ప్రశ్నించినందుకే తనపై ఏసీబీ దాడి జరిగిందని ఆరోపించారు. కమిషన్‌లో ఉన్నపుడే వివిధ ఆర్గనైజేషన్ల ద్వారా తమను బెదిరించారని, లోకాయుక్తలోనూ కేసు వేశామన్నారు. అర్హులైన నిరుద్యోగులకు సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.