‘ఏపీ ఎన్‌జీవో చేస్తున్న ప్రచారం అవాస్తవం’

APGEO President Comments On AP NGO - Sakshi

సాక్షి, విజయవాడ : జీవో 103ని రద్దుచేయాలని ఏపీ ఎన్‌జీవోలు ఆందోళన చేయడం హాస్యాస్పదం, అర్థరహితం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. టీడీపీ ప్రభుత్వానికి అనుబంధంగా వ్యవహరించిన ఏపీఎన్‌జీవో.. ఉద్యోగులకు ఏం మేలు చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ సంఘానికి గుర్తింపు ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా నిరసనలు చేయడం ఏపీఎన్‌జీవోకే చెల్లుతుందని విమర్శించారు.

కొందరు ఐఏఎస్‌లు దొడ్డిదారిన 103 జీఓ విడుదల చేసారని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ప్రభుత్వానికి అన్ని పత్రాలు సమర్పించిన తర్వాతే జీవో 103 జారీ చేశారని స్పష్టం చేశారు. చౌకబారు రాజకీయాలు మానకపోతే తగిన రీతిలో బదులు ఇస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో కలసి పనిచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం  కృషిచేయాలని ఏపీఎన్‌జీవోను కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top