
చదువుతోనే భవిష్యత్
కాసిపేట: చదువుతోనే భవిష్యత్ ఉంటుందని, చదువే మనల్ని ఉన్నతస్థానంలో నిలిపుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని వెంకటపూర్‌లో వందరోజుల్లో వందశాతం అక్షరాస్యతలో భాగంగా నిర్వహిస్తున్న వయోజన విద్య కేంద్రాన్ని బుధవారం రాత్రి పరిశీలించారు. విద్యతోపాటు వృత్తి శిక్షణలో నైపుణ్యం పొందాలని వయోజనులకు సూచించారు. ఆయన వెంట వయోజన విద్య అధికారి పురుషోత్తంనాయక్, తహసీల్దార్ భోజన్న, ఏంపీవో షేక్‌సబ్దర్ అలీ, డీఆర్పీలు బండ శాంకరి ఉన్నారు.
అక్షరాభ్యాస కేంద్రంలో వయోజనులతో పదాలు రాయిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్