
రైతులకు అవగాహన కల్పించాలి
● ముందస్తు సాగుతో నష్టాలు దూరం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
భూముల సమస్య పరిష్కరించాలి
భీమారం: కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూ ములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని మండలంలోని అంకుసాపూర్ రైతులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అంకుసాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. 292, 384 సర్వే నంబర్లలో 150మంది ఉన్నామ ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ స ర్పంచ్ దర్శనాల రమేశ్ మాట్లాడుతూ తమకు అ న్ని హక్కులు ఉన్న భూములను అటవీశాఖ అధి కారులు స్వాధీనం చేసుకుని కందకాలు తవ్వించారని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ 20రోజుల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్లు సదానందం, కృష్ణ పాల్గొన్నారు.