● 12నుంచి మంచిర్యాలలో ప్రారంభం ● ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ● ఒక్కొక్కరికి 48 స్లాట్లు.. రోజుకు 96
మంచిర్యాలటౌన్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేసి క్రయవిక్రయదారులకు సమయం వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టగా విజయవంతమైంది. దీంతో రెండో విడతలో మరికొన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించింది. మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 12నుంచి స్లాట్ బుకింగ్ విధానా న్ని అమలు చేయనున్నారు. దీంతో అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రస్తుతం సేల్‌డీడ్, గిఫ్ట్‌డీడ్, మార్టి గేజ్ డీడ్, పొజిషన్ వంటి అన్ని రకాల రిజిస్ట్రేషన్ల కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 12నుంచి స్లాట్ బుకింగ్ లేకుండా ఎ లాంటి రిజిస్ట్రేషన్ జరగదు. వెబ్‌సైట్ ద్వారా స్లా ట్ బుకింగ్‌కు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల అదే సమయానికి క్ర య, విక్రయదారులు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు 15నిమిషాల్లోపే సమయం పట్టనుంది. దీనివల్ల గంటల తరబడి రిజిస్ట్రేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఇకపై ఉండవు.
ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కరోజులో మొత్తం 96 స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఒక్క సబ్ రిజిస్ట్రార్‌తోనే కార్యాలయం నిర్వహిస్తుండగా స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభించే నాటి నుంచి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేయనున్నారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌గా ప్రియాంక పనిచేస్తుండగా, కరీంనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాజిరెడ్డిని మంచిర్యాలకు కేటాయించారు. దీంతో వీరిద్దరు 48 స్లాట్ల చొప్పున ప్రతీరోజు 96 స్లాట్ల బుకింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. registration.telangana. gov.in వెబ్‌సైట్ సందర్శించి స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
స్లాట్ బుకింగ్ ద్వారానే..
ఈ నెల 12నుంచి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానం ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయనున్నాం. ఇందుకోసం ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేయనున్నారు. స్లాట్ బుకింగ్ సమయంలో డాటా ఎంట్రీ జాగ్రత్తగా చేసి పూర్తి లింక్ డాక్యుమెంట్లతో న మోదు చేయాల్సి ఉంటుంది. 15నిమిషా ల్లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి సమ యం ఆదా అవుతుంది.
– ప్రియాంక, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్
ఇక పావుగంటలోనే రిజిస్ట్రేషన్లు