
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్‌ను అభినందించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 96 శాతం ఫలితాలు సాధించినట్లు ఏసీఎంవో జగన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 108 పాఠశాలలు, అందులో 65 పాఠశాలలు వంద శాతం వచ్చాయని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ఐటీడీఏ పీవో సారథ్యంలో చేపట్టిన మిషన్ లక్ష్యం ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఏడాదిలో పదిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఐటీడీఏ పీవో పేర్కొన్నారు.