పీఎం కిసాన్‌తో కలిపే ‘అన్నదాత సుఖీభవ’ | - | Sakshi
Sakshi News home page

పీఎం కిసాన్‌తో కలిపే ‘అన్నదాత సుఖీభవ’

Published Tue, May 6 2025 1:30 AM | Last Updated on Tue, May 6 2025 1:30 AM

పీఎం

పీఎం కిసాన్‌తో కలిపే ‘అన్నదాత సుఖీభవ’

కర్నూలు(అగ్రికల్చర్‌): 2024–25 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ కింద చెల్లించే పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం.. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అమలుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో సూపర్‌–6 హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా రైతులకు రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. గత ఏడాది జూన్‌ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా మొదటి ఏడాదే అన్నదాత సుఖీభవ కింద రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తారని ఆశించారు. కానీ ఆ దిశగా ఆలోచనే చేయలేదు. దీంతో చంద్రబాబు ఎన్నికల సమయంలో అధికారం కోసం ఒక విధంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తారనే చర్చ రైతుల్లో మొదలైంది. రైతుల్లో వ్యతిరేకత పెరుగకుండా ఉండేందుకు ఈ ఏడాది అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.14 వేలు వెరసి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇందుకు సంబందించి మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. అయితే కుటుంబం యూనిట్‌(కుటుంబంలో ఒక్కరికి మాత్రమే) లబ్ధి కల్పిస్తారు.

హంద్రీనీవా ఎస్‌ఈగా

పాండురంగయ్య

కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈగా

బాల చంద్రారెడ్డి

కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్‌–1 పర్యవేక్షక ఇంజనీర్‌గా పాండురంగయ్యను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్‌ఎల్‌సీ ఎగ్జిక్యుటివ్‌ ఇంజనీర్‌గా పాండురంగయ్య పని చేస్తున్నారు. హంద్రీనీవా సర్కిల్‌–1కి రెగ్యులర్‌ ఎస్‌ఈ లేరు. గత నెల 30న ఇన్‌చార్జిగా ఉన్న సురేష్‌ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హంద్రీనీవా విస్తరణ పనులు జరుగుతుండడంతో ఖాళీగా ఉన్న ఎస్‌ఈ పోస్టుకు పాండురంగయ్యను నియమించారు.

● అదేవిధంగా కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈగా బాల చంద్రారెడ్డిని నియమించారు. ఈయన కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈగా గతేడాది నాలుగు నెలలకుపైగా పని చేశారు. ప్రస్తుతం అదే సర్కిల్‌లో డిప్యూటీ ఎస్‌ఈగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో రెగ్యులర్‌ ఎస్‌ఈలుగా పదోన్నతులు ఇవ్వడంతో ద్వారకనాథ్‌ రెడ్డి ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో బాల చంద్రారెడ్డిని ఎస్‌ఈగా నియమితలయ్యారు.

అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించండి

కర్నూలు(సెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌(పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసెల్‌ సిస్టమ్‌)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి.నవ్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీఓపెన్‌ అయిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఆయా అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ఆడిట్‌ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎస్‌డీసీ వెంకటేశ్వర్లు పాల్నొన్నారు.

రేషన్‌ దుకాణాల్లో

విజిలెన్స్‌ తనిఖీ

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని రేషన్‌ దుకాణాల్లో సోమవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని 7, 14, 15 నంబర్‌ గల రేషన్‌ దుకాణాల్లో డీసీటీవో వెంకటేష్‌, సీఎస్‌డీటీ మహేష్‌, సచివాయలం వీఆర్వో లింగేష్‌ల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. డీసీటీవో వెంకటేష్‌ మాట్లాడుతూ పై మూడు దుకాణాల్లో స్టాక్‌లో తేడాలున్నందున షాపులను సీజ్‌ చేసినట్లు తెలిపారు.

పీఎం కిసాన్‌తో కలిపే ‘అన్నదాత సుఖీభవ’  1
1/1

పీఎం కిసాన్‌తో కలిపే ‘అన్నదాత సుఖీభవ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement