
సాక్షి, హైదరాబాద్: ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన విద్యార్థిని శనివారం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి మృతిచెందింది. మృతురాలిని ఏంఏ ఇంగ్లీష్ చదువుతున్న అంజలిగా(22) గుర్తించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.