Sri Lankan Airlines
-
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?
కొలంబో: పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారత్ నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్ చెందిన యూఎల్ 122 విమానంలో చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి.కాగా, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఎన్ఐఏ విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదుచేసింది. 100కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్ భల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్‌ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానంతోనే వారిని ఎన్ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం.పహల్గాం దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులోపలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలోనే ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
మాల్దీవులకు హాయ్
వరుస షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన హీరో రజనీకాంత్ హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులు వెళ్లారు. చెన్నై నుంచి మాల్దీవుల రాజధాని మాలె వరకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో రజనీ ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలో ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫ్లవర్ బొకేతో నవ్వుతూ కనిపించిన రజనీ కాంత్, మరో ఫొటోలో బ్యాగ్ పట్టుకుని, కళ్ల జోడు పెట్టుకుని స్టైలిష్‌గా ఉన్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాలో తన ΄ాత్ర (మొయిద్దీన్ భాయ్) షూటింగ్‌ని పూర్తి చేశారాయన. ఇప్పుడు కొంచెం విరామం దొరకడంతో రిఫ్రెష్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లారు రజనీకాంత్. కాగా ఆయన నటించిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. -
కొలంబోకు విమాన సర్వీసులు పునఃప్రారంభం
శంషాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. 19 నెలల తర్వాత శుక్రవారం ఉదయం 9.55 గంటలకు 120 మంది ప్రయాణికులతో శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం ఇక్కడి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండుసార్లు (సోమ, శుక్రవారం) ఈ విమాన సర్వీసులు ఉంటాయని గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానానికి జీఎంఆర్ ప్రతినిధులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. -
హైదరాబాద్–కొలంబో మధ్య శ్రీలంకన్ సర్వీసు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్–కొలంబో మధ్య విమాన సేవలను బుధవారం ప్రారంభించింది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. కొలంబోలో ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి ఉదయం 8.55కు హైదరాబాద్ చేరుకుంటుంది. ఉదయం 9.50కి తిరుగు ప్రయాణమై 11.45కు కొలంబోలో విమానం దిగుతుంది. జూలై 16 నుంచి కోయంబత్తూరు నుంచి కొలంబోకు సర్వీసు మొదలు పెడుతోంది. దీంతో భారత్‌లో 14 నగరాల్లో అడుగు పెట్టినట్టు అవుతుందని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శివ రామచంద్రన్ బుధవారం మీడియాకు తెలిపారు. దేశంలో వారానికి 126 సర్వీసులు నడిపిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎమిరేట్స్ తర్వాత ఈ స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన కంపెనీ తమదేనని గుర్తు చేశారు. ప్రయాణికుల సంఖ్య అధికమైతే సర్వీసులు పెంచుతామన్నారు. ‘2016లో 20 లక్షల మంది విమాన ప్రయాణికులు శ్రీలంకలో అడుగుపెట్టారు. వీరిలో భారత్ నుంచి 18 శాతం మంది ఉన్నారు. సంస్థ విమానాల్లో 80 శాతం సీట్లు నిండుతున్నాయి’ అని వివరించారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్ధనే సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
హైదరాబాద్ కు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన రంగంలో ఉన్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో మరిన్ని నగరాలకు సర్వీసులను పరిచయం చేయనుంది. వీటిలో హైదరాబాద్‌తోసహా వైజాగ్, చండీగఢ్ నగరాలు సంస్థ పరిశీలనలో ఉన్నాయని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన శ్రీలంకన్ హాలిడేస్ మేనేజర్ గయన్ పేరిస్ గురువారమిక్కడ తెలిపారు. ‘ప్రస్తుతం భారత్‌లో ఏడు నగరాలకు వారానికి 86 సర్వీసులను శ్రీలంక నుంచి నడుపుతున్నాం. భారత్‌లో కొత్త నగరాల్లో అడుగుపెట్టడం ద్వారా వీటి సంఖ్య పెంచుతాం’ అని చెప్పారు. కాగా భారత్ నుంచి 2014లో శ్రీలంకకు వెళ్లిన పర్యాటకుల సంఖ్య 2.4 లక్షలు. 2020 నాటికి ఈ సంఖ్య మూడింతలకుపైగా ఉంటుందని శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో సీఈవో విపుల వానిగశేఖర తెలిపారు.