Indian Superstar Rajinikanth Arrives in Maldives - Sakshi
Sakshi News home page

మాల్దీవులకు హాయ్‌

Jul 15 2023 4:32 AM | Updated on Jul 15 2023 9:19 AM

Indian superstar Rajinikanth arrives in Maldives - Sakshi

వరుస షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన హీరో రజనీకాంత్‌ హాలిడే ట్రిప్‌ కోసం మాల్దీవులు వెళ్లారు. చెన్నై నుంచి మాల్దీవుల రాజధాని మాలె వరకు శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌లో రజనీ ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఓ ఫొటోలో ఎయిర్‌ హోస్టెస్‌ ఇచ్చిన ఫ్లవర్‌ బొకేతో నవ్వుతూ కనిపించిన రజనీ కాంత్, మరో ఫొటోలో బ్యాగ్‌ పట్టుకుని, కళ్ల జోడు పెట్టుకుని స్టైలిష్‌గా ఉన్నారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్‌ సలామ్‌’ సినిమాలో తన ΄ాత్ర (మొయిద్దీన్‌ భాయ్‌) షూటింగ్‌ని పూర్తి చేశారాయన. ఇప్పుడు కొంచెం విరామం దొరకడంతో రిఫ్రెష్‌ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లారు రజనీకాంత్‌. కాగా ఆయన నటించిన ‘జైలర్‌’ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement