men cheat
-
మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కేటుగాళ్లు
-
ఫేస్బుక్లో ప్రేమించి.. పెళ్లంటే ముఖం చాటేసి..
విజయనగరం , పాలకోడేరు: అతనొక పోలీస్ కానిస్టేబుల్ ఫేస్బుక్లో ఓ మహిళతో పరి చయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆనక ము ఖం చాటేశాడు. దీంతో ఆ అమ్మాయి ఎస్పీని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే పాలకోడేరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డి.రమేష్ విజయనగరం జిల్లాకు చెందిన బి.ప్రసన్న ఫేస్బుక్లో పరిచయమయ్యా రు. అది ప్రేమగా మారింది. ఆ యు వతి అనేకసార్లు పాలకోడేరు వచ్చి రమేష్‌ను కలుసుకుంది. ఈ సంగతి యువతి ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకోవాలని ఆమె రమేష్‌పై ఒత్తిడి చేసింది. కానీ రమేష్ ముఖం చాటేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో సోమవారం ఆ యువతి ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇదే విషయమై పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా తరచూ ఫోన్ చేసేదని తెలిపారు. అయితే ఆ యువతి గతంలో పెళ్లయి విడాకులు తీసుకుందని, అందుకే ఆమె గురించి పట్టించుకోవడం మానేశానని రమేష్ చెప్పినట్టు ఎస్సై వివరించారు. -
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు
మలేసియా టౌన్షిప్: పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసు లు గురువారం కటకటాల్లోకి నెట్టారు. సీఐ కుషాల్కర్ కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెం దిన అడపా శ్యామ్‌కుమార్‌రెడ్డి కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్ లో నివాసముంటూ ఈవెంట్ ఆర్గనైజర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువతితో తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని పరిచయం చేసుకున్నా డు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా వారు శ్యామ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడారు. రూ. 10 లక్షలు కట్నం కావాలని కోరడంతో రూ. 5 లక్షలను వారు అతడికి ముట్టచెప్పి.. మిగతా డబ్బు పెళ్లి సమయంలో ఇస్తామన్నా రు. ఆ తర్వాత మనిద్దరికీ పెళ్లి కుదిరిపోయింది కాదా.. అని చెప్పి శ్యామ్‌కుమార్‌రెడ్డి యువతిని తనతో సినిమాలు, షికార్లకు తిప్పాడు. ఆరు నెలలుగా పెళ్లి మాట ఎత్తితే దాటేస్తున్నాడు. యువతికి అనుమానం వచ్చి ఆరా తీయగా.. అతడు మరో పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. దీంతో బాధితురాలు మూడు రోజుల క్రితం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్యామ్‌కుమార్‌రెడ్డిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.