పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు | He was betrayed to marry | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

Aug 25 2016 11:53 PM | Updated on Sep 4 2017 10:52 AM

నిందితుడు శ్యామ్‌కుమార్‌రెడ్డి

నిందితుడు శ్యామ్‌కుమార్‌రెడ్డి

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు.

మలేసియా టౌన్‌షిప్‌: పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసు లు గురువారం కటకటాల్లోకి నెట్టారు. సీఐ కుషాల్‌కర్‌ కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెం దిన అడపా శ్యామ్‌కుమార్‌రెడ్డి కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌ లో నివాసముంటూ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువతితో తాను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌నని పరిచయం చేసుకున్నా డు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా వారు శ్యామ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడారు.

రూ. 10 లక్షలు కట్నం కావాలని కోరడంతో రూ. 5 లక్షలను వారు అతడికి ముట్టచెప్పి.. మిగతా డబ్బు పెళ్లి సమయంలో ఇస్తామన్నా రు. ఆ తర్వాత మనిద్దరికీ పెళ్లి కుదిరిపోయింది కాదా.. అని చెప్పి శ్యామ్‌కుమార్‌రెడ్డి యువతిని తనతో సినిమాలు, షికార్లకు తిప్పాడు. ఆరు నెలలుగా పెళ్లి మాట ఎత్తితే దాటేస్తున్నాడు. యువతికి అనుమానం వచ్చి ఆరా తీయగా.. అతడు మరో పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. దీంతో బాధితురాలు మూడు రోజుల క్రితం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్యామ్‌కుమార్‌రెడ్డిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement