Gaddar Awards
-
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
-
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ వేడక ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి (Gaddar Film Awards) వేదిక ఖరారు అయింది. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు (Dil Raju) ఏర్పాట్లకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధ (Jayasudha)తో పాటుగా 15మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్‌రాజు, జయసుధ మీడియాతో మాట్లాడారు. జూన్ 14న హెచ్ఐసీసీ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉంటుందని వారు ప్రకటించారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం గురించి ఇలా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమకు చెందిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సహకాలతో పాటు అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇలా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం రేవంత్‌రెడ్డి భావించారని భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టమని ఆయన అన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయంగా భావించామన్నారు. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు. అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల జాబితాను జ్యూరీ ఛైర్మన్ జయసుధకు భట్టివిక్రమార్క, దిల్‌రాజు అందించారు. ఎంపిక అయిన 35 చిత్రాలను జ్యూరీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం వీక్షించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల భట్టి విక్రమార్క శ్రద్దాంజలి ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం వల్ల నేడు విడుదల చేయాల్సిన గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణను వాయిదా వేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ జరిపిస్తామని వారు తెలిపారు. -
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ అవార్డుల ఎంపికకు సంబంధించి జ్యూరీని ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ జ్యూరీ కమిటీని ప్రకటించారు. ఈ జ్యూరీకి ఛైర్మన్ టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. ఈ అవార్డులక వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు.ఈ జ్యూరీ ఉన్న సభ్యుల పేర్లను తాజాగా విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ కూడా మెంబర్‌గా ఎంపికయ్యారు. వీరితో పాటు డైరెక్టర్లు దశరథ్, నందిని రెడ్డి, శ్రీనాథ్,ఉమామహేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, వీఎన్ ఆదిత్య కూడా ఉన్నారు. ఎగ్జిబిటర్ విజయ్ కుమార్ రావు, ఫిల్మ్ అనలిస్ట్ ఆకునూరు గౌతమ్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, జర్నలిస్టులు లక్ష్మీ నారాయణ, వెంకటరమణ కూడా సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. టీజీఎఫ్డీసీ ఎండీ మెంబర్, కన్వీనర్‌గా ఉండనున్నారు. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాల విభాగాల్లో 76 నామినేషన్లు వచ్చాయి. ఓవరాల్‌గా గద్దర్ అవార్డులకు 1248 నామినేషన్లు అందాయి. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. -
గద్దర్ అవార్డులు.. జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్‌గా సినీ నటి జయసుధను నియమించారు. దాదాపు 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర విభాగాల్లో 76 నామినేషన్స్ వచ్చాయి. వ్యక్తిగత కేటగిరిలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ అవార్డులకు 1248 నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను అందజేయనుంది. -
ఏప్రిల్‌లో గ్రాండ్‌గా ‘గద్దర్’ అవార్డులు.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ఏప్రిల్‌లో ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్ అవార్డు( Gaddar Awards)ను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది . తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత 2014 నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ అవార్డు 2023 వరకు ఇవ్వనున్నాం.నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. వారం రోజుల్లో అవార్డులను జ్యూరీ ఫైనల్ చేస్తుంది. గద్దర్ అవార్డు నమునా కూడా సిద్ధం అవుతోంది. ఏప్రిల్‌లో అంగరంగ వైభవంగా సినిమా అవార్డుల వేడుక నిర్వహిస్తాం. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయొద్దని కోరుతున్నాను. గతంలో సింహా అవార్డుల కోసం అమౌంట్ పే చేసిన వారికి ఎఫ్డీసీ నుంచి తిరిగి చెల్లింపులు అవుతాయి. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో కూడా గౌరవ అవార్డులు ఇస్తాం’ అని దిల్ రాజు చెప్పారు.