Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Full list of Cabinet Ministers in Narendra Modi Government
కేంద్ర కేబినెట్‌: మోదీ 3.0 మంత్రులు వీరే..

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలకు మరోసారి కేబినెట్‌ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, పాత కేబినెట్‌లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లకు కేబినెట్‌లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్‌ కేబినెట్‌లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్‌లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్‌లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్‌), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్‌ఎల్‌డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్‌ పవార్‌ ఎన్‌సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్‌నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్‌డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్‌నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్

Differences Between Pithapuram Tdp And Jana Sena
టీడీపీ Vs జనసేన.. పిఠాపురంలో మరో రచ్చ..

సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది.ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.

550 Times Re Released Movie Creat All Time Record
550 సార్లు రీ-రిలీజ్‌ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్‌... ఒకప్పుడు బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్‌ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్‌ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్‌ చేసిన 'ఓం' ఈ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్‌ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్‌గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్‌ చేసిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్‌ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్‌ థియేటర్‌లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్‌ చేయడం అనేది ఆల్‌టైమ్‌ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్‌, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్‌ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్‌ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్‌ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్‌ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్‌ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్‌ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్‌' పేరుతోనే రాజశేఖర్‌ రీమేక్‌ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్‌లో 'అర్జున్‌పండిట్‌' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్‌ చేశారు.

whats wrong with the T20 World Cup pitches in New York?
దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో అస‌లు సిస‌లు స‌మ‌రానికి రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 8 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో యుద్దానికి ఆ రెండు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం​ చేసుకున్నాయి.ఓ జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపతాన్ని కొనసాగించాలని భావిస్తుంటే.. మరో జట్టు చరిత్రను తిరిగి రాయాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు క్రికెట్ అభిమానులు అయితే ఈ ఉపోధ్గాతం అంతా ఎవరి కోసమో ఈపాటికే అర్థం అయిపోయింటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయ‌ర్క్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్ధులైన భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకున్నాయి. సాధ‌ర‌ణంగా దాయాదుల పోరు అంటే అందరూ ఎవరు గెలుస్తారు? ఏ జ‌ట్టు బ‌ల‌మెంత‌? బ‌ల‌హీన‌త‌లు ఏంటి? అంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ‌ న‌డుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ దాయాదుల పోరుకు వేదికైన నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌పైనే అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈ వికెట్‌ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.అది పిచ్ కాదు.. భూతంఈ ఏడాది పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ఆరంభానికి మూడు నెల‌ల ముందు అమెరికాలోని న్యూయ‌ర్క్‌లో కొత్త‌గా అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. అదే నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నసావు మైదానం వేదిక‌గా మొత్తం 8 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మెగా టోర్నీలో శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా, ఐర్లాండ్‌- కెనడా, దక్షిణాఫ్రికా-నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌లు జ‌రిగాయి. ఈ స్టేడియంలోని పిచ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ వికెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవ‌రికి ఆర్ధం కావ‌డం లేదు. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ కార‌ణంగా బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న‌సావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు.ఇప్ప‌టివర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల్లో కెన‌డా చేసిన 137 ప‌రుగులకే అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. పిచ్‌పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. న‌సావు వికెట్ ఎలా ఉందో ఈ గ‌ణాంకాలు చూస్తే మ‌న‌కు అర్ధమ‌వుతుంది. అస్స‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. ద‌క్షిణాఫ్రికా, భార‌త్ వంటి మేటి జ‌ట్లు కూడా స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.అంతేకాకుండా ఆట‌గాళ్లు గాయాల బారిన కూడా ప‌డుతున్నారు. ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ రాక‌సి బౌన్స‌ర్ వ‌ల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మోచేతికి గాయ‌మైంది. దీంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే రోహిత్ మైదానాన్ని వీడాడు. అయితే ఈ పిచ్‌పై రోహిత్ శ‌ర్మ సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఈ వికెట్‌పై 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు కొత్త పిచ్ ఉప‌యెగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ‌ కొత్త పిచ్‌ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

Anti Pyongyang Loudspeaker Broadcasts in Retaliation Against Trash Balloons
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్‌ కొరియా కిమ్‌!

ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్‌లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్‌లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్‌లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్‌లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు.

Satya Nadella 10 career tips after decade as Microsoft CEO
సత్య నాదెళ్ల సక్సెస్‌ అయింది ఇలాగేనా..?

మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా యాపిల్‌ను అధిగమించేలా మైక్రోసాఫ్ట్‌ను సత్య నాదెళ్ల విజయవంతంగా నడిపించారని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక తెలిపింది.తనను విజయపథంలో నడపడానికి దోహదపడిన అంశాల గురించి సత్య నాదెళ్ల పలు సందార్భాల్లో వెల్లడించారు. వాటిలో 10 మేనేజ్‌మెంట్, కెరీర్ టిప్స్‌ ఇక్కడ ఇస్తున్నాం..ఏదీ లేనప్పుడు స్పష్టతను సృష్టించగలగడం ఏ నాయకుడికైనా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.విషయాలు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి మన చుట్టూ శక్తిని సృష్టించుకునే నైపుణ్యాలను పెంచుకోవాలి.నాయకుడనే వాడు మితిమీరిన నియంత్రిత ప్రదేశంలోనూ విజయాన్ని సృష్టించగలగాలి.ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి.విధుల్లో మానసిక భద్రతను పెంపొందించడంలో తాను పెద్దవాడినని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ప్రశ్నలు అడిగినందుకు, ఆందోళనలను పంచుకున్నందుకు లేదా తప్పులు చేసినందుకు ఉద్యోగులు శిక్షకు భయపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది.సత్య నాదెళ్ల సహానుభూతిని మృదువైన నైపుణ్యంగా పరిగణించరు. వాస్తవానికి ఇది మనం నేర్చుకునే కఠినమైన నైపుణ్యమని ఆయన నమ్ముతారు.ఎవరూ "పరిపూర్ణ" నాయకుడు కారు. కానీ వారు తమ ఉద్యోగులకు మరింత స్పష్టత, శక్తి లేదా స్వేచ్ఛను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించే వారు ఎల్లప్పుడూ మెరుగుపడతారు.మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీ ప్రస్తుత బాధ్యతల నుంచి నేర్చుకుంటూ ఉండండి. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు సీఈవో అవుతానని సత్య నాదెళ్ల ఎప్పుడూ అనుకోలేదు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా రాణించడంపైనే దృష్టి పెట్టారు.అడాప్టబుల్‌గా ఉండండి. మైక్రోసాఫ్ట్ లో పనిచేసినంత కాలం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తాను పనిచేసిన బృందాలు, తాను నిర్వహించిన విభాగాలను బట్టి నిరంతరం మారాల్సి వచ్చిందని సత్య నాదెళ్ల చెప్పారు.మీ లక్ష్యం.. మిమ్మల్ని నడిపించేది ఏమిటో తెలుసుకోండి. మనం ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నందున, పనికి లోతైన అర్థం గురించి ఆలోచించడం అవసరం.

Pihu Movie Review And Rating Telugu Latest
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!

మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూసి తీరాల్సిందే. లేదంటే చాలా అంటే చాలా మిస్సవుతారు. పోస్టర్ చూడగానే ఇదేదో పిల్లల మూవీ అనుకుంటారేమో. మొత్తం చూసిన తర్వాత మీ చిన్నారుల్ని ఇంట్లో వదిలి వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే అంతలా మిమ్మల్ని డిస్ట్రబ్ అయ్యేలా చేస్తుంది. ఓటీటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు! జస్ట్ రూ.45 లక్షల బడ్జెట్‌తో తీశారు. 2018లో రిలీజైన ఈ మూవీలో అంతలా ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉంది? ఓవరాల్ రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 2 వారాల్లోనే ఓటీటీలోకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'పిహు' సినిమా విషయానికొస్తే.. పిహు (పిహు మైరా విశ్వకర్మ) రెండేళ్ల పాప. ఉదయం నిద్రలేచేసరికి తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని పడి ఉంటుంది. ఆమె నిద్రపోతోందేమో అని పిహు అనుకుంటుంది. చాలాసార్లు లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ పాప వల్ల కాదు. అలానే పిహు చిన్నపిల్ల కావడంతో బయటకు రాలేక ఇంట్లోనే చిక్కుకుపోతుంది. ఫ్రిడ్జ్, గ్యాస్, వాటర్ ఫిల్టర్, ఇస్తీ పెట్టె లాంటి వాటి గురించి తెలియకపోవడం వల్ల అన్నింటిని ఆన్ చేసి పెట్టేస్తుంది. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సిట్చ్యూయేషన్ నుంచి పిహు ప్రాణాలతో బయటపడిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.సాధారణంగా చిన్నపిల్లల సినిమాలు చూడటానికి సరదాగా ఉంటాయి. 'పిహు' మాత్రం మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు వణికిపోయేలా చేస్తుంది. ఇందులో కొత్తగా ఏం ఉండదు. ఓ పాప, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, గ్యాస్ లాంటివి ఆన్ చేసేసి ఇవేంటి ఇంత డేంజర్ అనుకునేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలని ఇంట్లో వదిలి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పడాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)ఈ మూవీ అంతా అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లోనే షూట్ చేశారు. కానీ చూస్తున్నంతసేపు ఏ మాత్రం బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా? పిహుకి ఏం కాదుగా అని మనం టెన్షన్ పడేలా చేస్తుంది. కేవలం గంటన్నరే ఉంటుంది. కానీ మూవీ పూర్తయిన తర్వాత మనల్ని పిహు పాత్ర వెంటాడుతుంది. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేసి పడేసింది. ఎలా ట్రైనింగ్ ఇచ్చారో, ఏం చేశారో గానీ మూవీ చూసిన తర్వాత మాత్రం పాప క్యూట్‌నెస్, యాక్టింగ్‌కి ఫిదా అయిపోతాం.చాలామంది పిల్లలు ఇంట్లో కుదురుగా ఉండకుండా.. వస్తువులతో ఎలా పడితే అలా ఆడుకుంటూ ఉంటారు. కానీ అవి ఎంత ప్రమాదం అనేది పిల్లలకు కచ్చితంగా చెప్పాలి బాబోయ్ అని 'పిహు' చూసిన తర్వాత మీకు పక్కా అనిపిస్తుంది. ఇప్పటికే మీకు పిల్లలున్నా, త్వరలో పిల్లల్ని ప్లాన్ చేస్తున్నా.. నెట్‌ఫ్లిక్స్‌లో అర్జెంట్‌గా ఈ మూవీ చూడండి. హిందీలో అందుబాటులో ఉంది. వేరే భాష అని కంగారు పడాల్సిందేం లేదు. ఈ మువీలో డైలాగ్స్ కంటే సీన్స్ ఎక్కువ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)

Telangana Latest News: Ramoji Rao Last Rites Updates
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌, సాక్షి: రామోజీగ్రూప్‌ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్‌ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ నిప్పంటించారు.రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ

Sakshi Editorial On results in evms
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!

‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్‌ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్‌ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్‌ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్‌ సీడింగ్‌ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్‌ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్‌ లేదా మయన్మార్‌ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్‌? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్‌ సీడింగ్‌ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌లను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్‌ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్‌ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్‌ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్‌ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్‌ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్‌ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్‌ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్‌ చేస్తున్నారా? వేలాది పోలింగ్‌ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్‌ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్‌’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్‌ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్‌ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్‌ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్‌ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్‌ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్‌ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్‌ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్‌ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్‌ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్‌ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్‌ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్‌ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్‌ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్‌ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్‌ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్‌ పదవులు కావు. సెర్చ్‌ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

newly married couple suicide in hyderabad
కలిసి బతకలేమని కడతేరిపోయారు!

జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్‌ హెచ్‌ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్‌ (26), గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్‌లో కాపురం పెట్టారు. రెశ్వంత్‌ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్‌ హెచ్‌ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్‌ఏఎల్‌ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement