వేలం వేస్తే ఎన్నిక చెల్లదు
టోల్‌ఫ్రీ నంబర్ 8978928637
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
ఫ రుజువైతే ఎన్నికై న ప్రతినిధులపై అనర్హత వేటు
ఫ ఖర్చుపై అభ్యర్థులు ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాలి
ఫ సంతానం ఎంతమంది ఉన్నా పోటీ చేయొచ్చు
‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు
సాక్షి, యాదాద్రి: ‘పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమం.. అటువంటి ఎన్నిక చెల్లదు.. రుజువైతే ఎన్నికై న ప్రతినిధులపై అనర్హత వేటు పడుతుంది’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సర్పంచ్ పదవులను కొనుగోలు చేసే విధంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారు శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఓటు చిత్తు కాకుండా ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ‘సాక్షి’ వెల్లడించారు.
పదవులు వేలం వేయాలనే నిర్ణయం తప్పు
వేలం ద్వారా సర్పంచ్ పదవులు దక్కించుకోవాలనే నిర్ణయం తప్పు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సీరియస్‌గా ఉంది. డబ్బులు ఇచ్చి పదవి ఏకగ్రీవం చేసుకుంటామని కొందరు సోషల్ మీడియాలో, గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటివారిని గుర్తించడానికి నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. వేలం పాటల ద్వారా ఎన్నికై న సర్పంచ్‌లు పదవిని కోల్పోతారు.
రూల్స్ ఉల్లంఘిస్తే అనర్హత
సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తామని ముందుగానే ఎన్నికల అధికారులకు అఫిడవిట్ ఇవ్వాలి. ప్రతి అభ్యర్థి కొత్తగా బ్యాంకులో అకౌంట్ తీయాలి. పరిమితికి మించి ఖర్చు చేస్తే వారిని ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్‌న్ పత్రాలు సమర్పించవచ్చు. డమ్మీ నామినేషన్‌న్ వేయడం మంచింది. అన్ని నామినేషన్‌న్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం.
116 ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ
మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో 116 లొకేషన్లలో నామినేషన్లు స్వీకరిస్తాం. తొలివిడత జరిగే ఆరు మండలాల్లో 42 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. డిసెంబర్ 11, 14,17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు మూడు విడతల్లో 9వేల మంది విధుల్లో పాల్గొంటారు.
ఆర్‌ఓ రూం సమయమే పరిగణనలోకి..
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.ఎన్ని కల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) రూంలోని గడియారం చూపే సమయాన్నే పరిగణలోకి తీసుకుంటాం. అభ్యర్థితో పాటు అతని వెంట మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ర్యాలీగా వచ్చే వారు నామినేషన్‌న్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండాలి.
కులధ్రువీకరణ తప్పనిసరి
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే సమయానికి కుల ధ్రువీకరణ పత్రం అందకపోతే డిప్యూటీ తహసీల్దార్‌తో రాత పూర్వకంగా తీసుకురావాలి. నామినేషన్ స్క్రూట్నీ రోజు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి.
ఓటు వేసే విధానంపై
ప్రచారం
ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై ప్రచారం చేస్తాం. చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఓటు చెల్లకుండా పోతుంది. అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రదర్శనల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తాం. ఏకగ్రీవ నజరానాలపై ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఎన్నికల వివరాలన్నీ టి–పోల్‌లో..
ఎన్నికలకు సంబంధించిన వివరాలన్నీ టి–పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేశాం. ప్రజలు ఏ సమాచారం కావాలన్నా టి–పోల్‌లో చూసుకోవచ్చు.
తొలి విడత ఏర్పాట్లు పూర్తి
తొలి విడత ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ నిర్వహణకు 2,742 మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. పోలింగ్ కేంద్రాలకు 3,100 బ్యాలెట్ బాక్స్‌లతో పాటు ఇతర సామగ్రి చేరవేశాం. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషనన్ సెంటర్లు ఏర్పాటు చేసి పోలింగ్ ముందు రోజు పంపిణీ చేస్తాం. సర్వేలెన్స్ టీం ఏర్పాటు చేశాం.
అభ్యంతరాలు, ఫిర్యాదులు, ఇతర ఏ సమస్యలున్నా తెలియజేసేందుకు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలకు 48 గంటల ముందుగానే ఆర్డీఓల నుంచి అనుమతి పొందాలి.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇప్పటి వరకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయడానికి అర్హత ఉండేది కాదు.
వేలం వేస్తే ఎన్నిక చెల్లదు


