సర్పంచ్‌కు 205, వార్డులకు 134
తొలి విడత మొదటి రోజు భారీగా నామినేషన్లు
ఫ ఎన్నికల నోటిఫికేషన్
వెలువడిన వెంటనే నామినేషన్ల
స్వీకరణ ప్రారంభం
ఫ ఆరు మండలాల్లో 153 సర్పంచ్‌లు,
1,286 వార్డు స్థానాలు
సాక్షి,యాదాద్రి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత నామినేషన్ల పర్వం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయగానే ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. 153 సర్పంచ్ స్థానాలకు మొదటి రోజు 205 నామినేషన్లు, 1,286 వార్డు స్థానాలకు 134 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
మధ్యాహ్నం తరువాత
ఊపందుకున్న నామినేషన్లు
నామినేషన్ల ప్రక్రియ ఉదయం సమయంలో మందకొడిగా సాగింది. నామినేషన్ పత్రాలకు జతపర్చాల్సిన సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతాలు సకాలంలో అందకపోవడంతో అభ్యర్థులు వేచిచూడాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమై నాలుగు గంటల తర్వాత ఊపందుకుంది. శుక్ర, శనివారాల్లో అష్టమి, నవమి ఉందని చాలామంది మొదటి రోజునే నామినేషన్లు వేశారు.
427 పంచాయతీలు
భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగుతుర్తి, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో ఆలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 153 పంచాయతీలు, 1,286 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 150 పంచాయతీలు, 1,332 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడవ విడతలో మునుగోడు, తుంగతుర్తి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 124 పంచాయతీలు, 1,086 వార్డులు ఉన్నాయి.
సర్పంచ్ స్థానాలకు దాఖలైన నామినేషన్లు
మండలం జీపీలు నామినేషన్లు
ఆలేరు 16 16
రాజాపేట 23 34
యాదగిరిగుట్ట 23 31
బిరామారం 35 33
ఆత్మకూర్ 23 43
తుర్కపల్లి 33 49
మొత్తం 153 205
వార్డు స్థానాలకు..
ఆలేరు 140 09
రాజాపేట 206 21
యాదగిరిగుట్ట 198 49
బి.రామారం 284 07
ఆత్మకూర్ 192 14
తుర్కపల్లి 266 34
మొత్తం 1,286 134


