
పైసలిస్తేనే పనులు !
చాట్రాయి తహసీల్దార్ సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై కలెక్టర్ చర్యలు
చాట్రాయి: అవినీతి ఆరోపణల నేపథ్యంలో చాట్రాయి తహసీల్దార్ డి.ప్రశాంతిని కలెక్టర్ వెట్రిసెల్వి గురువా రం సస్పెండ్ చేశారు. చాట్రా యి మండలంలోని సోమవరంలో రిజిస్ట్రేషన్ అటవీ భూములను మ్యూటేషన్ చేయడం, జనార్దనవరంలో వాగు పోరంబోకు, అసైన్డ్ భూమికి పట్టా ఇవ్వడంపై ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కలెక్టర్ రెండుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా తహసీల్దార్ స్పందించలేదు. అలాగే త హసీల్దార్ అవినీతిపై సీఎం చంద్రబాబు వద్దకూ ఫిర్యాదు లు వెళ్లాయి. సొమ్ములు తీసుకోకుండా తహసీల్దార్ ఏపని చేయడం లేదని మండల ప్రజలు అంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు కోరగా ఇవ్వనని, మంత్రి పార్థసారథిని వెళ్లి కలవాలనడం, గ్రావెల్ కోసం నరసింహరావుపాలెం పంచాయతీ తీర్మానం చేసినా అ నుమతులు ఇవ్వకపోవడం వివాదాస్పదమయ్యా యి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారికి అనుమతులు ఇవ్వడం, వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆమె కార్యాలయానికి వెళితే పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు వ్యకులు తహసీల్దార్‌కు షాడోలుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు.
ఏలూరు(మెట్రో) : ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతిమయం వెరసి ప్రజలకు ప్రభుత్వ సేవలు దూరమవుతున్నాయి. గ్రామస్థాయిలో సేవలందించాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. గతంలో గ్రామ సచివాలయాల ద్వారా ఉన్న సమస్యల పరిష్కార వెసులుబాటు ప్రస్తుతం లేకపోవడం కొందరు అధికారులకు కల్పతరువుగా మారింది. జిల్లావ్యాప్తంగా 28 మండలాల పరిధిలో ఆయా తహసీల్దార్ కా ర్యాలయాల్లో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఎక్కువగా మ్యూటేషన్లు పెండింగ్‌లో పెడుతూ ప్రజ ల నుంచి రెవెన్యూ అధికారులు సొమ్ములు వసూలు చేస్తున్నారు. భూ సంబంధిత తగాదాలు, కుల, ఆ దాయ ధ్రువీకరణ పత్రాల జారీకి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోంది. అవినీతి, సేవల జా ప్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. తాజాగా అవినీతి ఆరోపణలతో చాట్రా యి తహసీల్దార్ డి.ప్రశాంతి సస్పెన్షన్‌కు గురికావడం రెవెన్యూ వర్గాల్లో ఉలికిపాటు కలిగించింది.
ఇప్పటికే జీలుగుమిల్లిలో..
ఏజెన్సీ ప్రాంతమైన జీలుగుమిల్లి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తూ ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వ్యవహరించిన సందీప్‌గౌడ్ సై తం రెవెన్యూలో అక్రమాలకు తెరలేపారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పరంపర కొనసాగడం, ఏజెన్సీ భూముల మ్యూటేషన్, రెవెన్యూ సమస్యల విషయాల్లో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడమే సందీప్ సస్పెన్షన్‌కు సైతం దారి తీసింది.
గత ప్రభుత్వంలో పారదర్శకంగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాల యాల ద్వారా భూసమస్యల నుంచి జనన, మరణ, కులధ్రువీకరణ పత్రాల జారీ, భూముల రిజిస్ట్రేషన్ల వరకూ అవినీతికి తావులేకుండా సేవలందించే వారు. కూటమి ప్రభుత్వంలో సచివాలయాల ద్వా రా ఆయా సేవలు అందకపోవడంతో ప్రజలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల బాట పట్టాల్సి వస్తోంది. అక్కడ ప్రతి పనికీ పైసలివ్వాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు సొమ్ములు డిమాండ్ చేస్తున్నారంటూ ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదులు చేస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో ముడుపులు
వరుసగా బయటపడుతున్న అక్రమాలు
చాట్రాయి తహసీల్దార్ సస్పెన్షన్‌తో ఉలికిపాటు