
టెంట్ సప్లయ్ చేసినందుకు..
మాది చిన్నధన్వాడ గ్రామం. అయితే గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి టెంట్లు, డ్రమ్ములు, సప్లయర్ వస్తువులు అద్దెకు అందిస్తూ జీవనం సాగిస్తున్నాం. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న క్రమంలో మా ఆయన పరుశరాముడు టెంట్ ఇతర వస్తువులు సప్లయ్ చేశాడు. దానికి బుధవారం జరిగిన ఘటనలో ఆయన పేరు చేర్చి రిమాండ్‌కు తరలించారు. నాయకులు, పెద్ద వాళ్లు అయితే ఏదోలా బయట పడతారు. కానీ పని చేసుకుని బతికే మమ్మల్ని ఎవరు బయటకు తీసుకువస్తారు. మాకు ముగ్గురు పిల్లలున్నారు. పిల్లలకు బడులు ప్రారంభమవుతాయి. కానీ ఇంట్లో నా భర్త లేని కారణంగా మాకు ఏం అర్ధం కావడం లేదు. – శ్రావణి, రిమాండ్‌కు వెళ్లిన పరుశరాముడి భార్య
●