ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ చేరుకున్న కేటీఆర్‌, హరీష్‌ | MLC Kavitha IN ED Custody Over Liquor Scam Case Live Updates | Sakshi
Sakshi News home page

ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు.. అప్‌డేట్స్‌

Mar 17 2024 8:49 AM | Updated on Mar 17 2024 12:54 PM

MLC Kavitha IN ED Custody Over Liquor Scam Case Live Updates - Sakshi

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో..

Updates..

►ఢిల్లీ చేరుకున్న కేటీఆర్‌, హరీష్‌రావు

►ఈరోజు సాయంత్రం కవితను కలవనున్న కేటీఆర్‌, హరీష్‌

కవిత అరెస్టు చట్టబద్ధమే: కోర్టు

  • కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చిన సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో సంచలన విషయాలు
  • కవితను అరెస్టు చేయవద్దని ఎక్కడా సుప్రీంకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదు 
  • తదుపరి హియరింగ్ వరకు మాత్రమే సమన్లు ఇవ్వమని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది 
  • ఆ తర్వాత రెండుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో వాటిని ఛాలెంజ్ చేయలేదు 
  • సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట తప్పారా లేదా అన్నది? మా పరిధిలో నిర్ణయించే అంశం కాదు 
  • సెక్షన్-19 ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ అరెస్టు చేశారా లేదా అన్నది మాత్రమే చూస్తాం  
  • కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశారు 
  • మనీలాండరింగ్ చట్టం సెక్షన్-19 కింద అన్ని నిబంధనలను పాటించారు 
  • ఈ నేరాల్లో కవిత కీలక పాత్ర పోషించారనేదానికి ఆధారాలు ఉన్నాయి 
  • అందుకే ఆమెను రిమాండ్ చేస్తూ దర్యాప్తు కోసం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నాం 
  • సీసీటీవీ కవరేజ్‌లో ఆమెను విచారించాలి. 
  • సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలి 
  • మహిళను విచారించే సమయంలో తీసుకోవలసిన అన్ని నిబంధనలు పాటించాలి 
  • ఆమె తరపు న్యాయవాదులు ప్రతిరోజు అరగంట పాటు కలవవచ్చు
  • ఆమె  భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ , బావ హరీష్ రావు కజిన్ బ్రదర్స్ శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ కలుసుకునే అవకాశం ఉంది 
  • అరెస్టు తరువాత హైబీపీకి గురైనట్లు ఈసీజీ రిపోర్టు ఉన్న నేపథ్యంలో తగిన మందులు ఇవ్వాలి 
  • 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలి

►ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కవితను కలవునున్న కేటీఆర్‌, హరీష్‌ రావు.

నేటి నుంచి కవిత కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌

  • నేటి నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కస్టోడియల్ ఇంటరాగేషన్ 
  • ప్రతిరోజు ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు ఇంటరాగేషన్ చేయనున్న ఈడీ
  • కవిత పాత్రకు సంబంధించి ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చిన   అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి 
  • ఆమె టీంలో ఉన్న సభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కవిత ద్వారా ధ్రువీకరించనున్న ఈడీ
  • గత విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కవిత తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని ఈడీ ఆరోపణ
  • ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు కుటుంబ సభ్యులను లాయర్లను కలుసుకునేందుకు అనుమతించిన కోర్టు 
  • నేడు సాయంత్రం కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు , లాయర్లు

►శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి.

►ప్రతీరోజు కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు అవకాశమిచ్చిన ‍కోర్టు.

►నేడు ఢిల్లీకి వెళ్లనున్న బీఆర్‌ఎస్‌ నేతలు.

►ఈడీ కస్టడీలో కవిత విచారణను వీడియో తీయనున్న ఈడీ అధికారులు. 

►ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఈడీ అధికారులను ఆదేశించింది.

►ఇక, లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఈడీ కవితను శుక్రవారం సాయంత్రం హైదరా­బాద్‌లో అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.

►ఈ క్రమంలో కవితను ఈడీ అధికారులు శనివారం ఉదయం 11.30 సమ­యంలో ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరు­పర్చారు. మద్యం స్కాం కేసుకు సంబంధించి కవిత నుంచి కీలక అంశాలు రాబట్టాల్సి ఉందని, ఆమెను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

కవిత భర్త అనిల్, వ్యక్తిగత  సిబ్బందికి ఈడీ నోటీసులు..
►కవిత భర్త అనిల్‌కు, ఆమె వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. వారిని సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు ఈ నలుగురి ఫోన్లను సీజ్‌ చేశారు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement