Massive Fire Broke Out at a Garment Shop in Palika Bazar, Near Secunderabad Railway Station - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

Jul 9 2023 7:57 AM | Updated on Jul 12 2023 9:01 PM

Fire Accident Near Secunderabad Railway Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. షాట్‌ సర్కిట్‌తో మంటలు అంటుకొని దుకాణం నుంచి పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది. సమీప షాప్‌లకు మంటలు విస్తరిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడుఫైర్‌ ఇంజిన్స్‌తో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.

కాగా సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాళికా బజార్‌లోగల ధమాకా సేల్‌ రెడీమేడ్‌ బట్టల షాప్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీని చుట్టుపక్కలు పలు షాపులతోపాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్‌లోని బట్టల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని మంత్రి తలసాని పరిశీలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అగ్నిమాద ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. సాయంత్రం కల్లా వివరాలన్నీ వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే అగ్ని ప్రమాదాలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు..

చదవండి: రైళ్లలో అరకొరగా ఆన్‌బోర్డు సేవలు 

Advertisement
 
Advertisement
Advertisement