
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డిని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) ఆదివారం ప్రకటించింది. సంఘం అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
చెన్నకేశవరెడ్డి 2011–17 వరకు సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, 2017–18లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్లు వారు తెలిపారు. అభ్యర్థి ఎంపిక సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.