థగ్‌లైఫ్‌కు అక్కడ ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

థగ్‌లైఫ్‌కు అక్కడ ఇక్కట్లు

Jun 4 2025 12:49 AM | Updated on Jun 4 2025 12:49 AM

థగ్‌ల

థగ్‌లైఫ్‌కు అక్కడ ఇక్కట్లు

తమిళసినిమా : కొన్ని సమయాల్లో చిత్రాల విడుదల పెద్ద సమస్యగా మారుతుంది. ఒక్కోసారి చిత్రాల్లో ఎలాంటి అభ్యంతర సన్నివేశాలు లేకపోయినా వాటి విడుదల సందర్భంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంటుంది. అందుకు ఆ చిత్రాలకు సంబంధించిన వ్యక్తుల వివాదాస్పద వ్యాఖ్యలు కారణం అవుతున్నాయి. ఇప్పుడు నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన థగ్‌లైఫ్‌ చిత్రం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 5వ తేదీన తెరపైకి రానుంది. ఇలాంటి సమయంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నటుడు కమలహాసన్‌ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు అక్కడ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని నటుడు కమలహాసన్‌ అన్న ఒకే ఒక్క మాటే ఈ అనర్థానికి దారితీసింది. దీంతో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, కన్నడ భాష సంఘాలు, కన్నడ ఫిలిం చాంబర్‌ వరకు కమలహాసన్‌ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేకుంటే థగ్‌ లైఫ్‌ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్‌ చేస్తామని హెచ్చరించారు. కన్నడ భాషా సంఘాల చెందిన వారు ఆ రాష్ట్రంలోని థియేటర్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కమలహాసన్‌ మాత్రం ప్రేమతో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండదని ఖరాకండిగా పేర్కొన్నారు. దీంతో సమస్య విశ్వరూపం దాల్చింది. కమలహాసన్‌ ఈ వ్యవహారంపై కర్ణాటకలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ శాఖ, ఫిలిం చాంబర్‌ థగ్‌లైఫ్‌ చిత్రం విడుదలను అడ్డుకోరాదని, చిత్రం విడుదలకు అవసరమైన రక్షణను కల్పించాలని, ఈ విషయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖ అధికారులకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా మరోవైపు కమలహాసన్‌ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. సత్యం తలవంచదు అనే స్లోగన్‌ దీంతో కమలహాసన్‌ పార్టీ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ తరఫున తమిళనాడు వ్యాప్తంగా వాల్‌ పోస్టర్లు వెలిశాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోందనే మాట వినిపిస్తోంది. పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.

థగ్‌లైఫ్‌కు అక్కడ ఇక్కట్లు 1
1/2

థగ్‌లైఫ్‌కు అక్కడ ఇక్కట్లు

థగ్‌లైఫ్‌కు అక్కడ ఇక్కట్లు 2
2/2

థగ్‌లైఫ్‌కు అక్కడ ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement