పీవీ సింధుకు సీఎం జగన్‌ అభినందనలు | YS Jagan Mohan Reddy Congrats PV Sindhu For Winning Swiss Open 2022 | Sakshi
Sakshi News home page

PV SIndu: పీవీ సింధుకు సీఎం జగన్‌ అభినందనలు

Mar 27 2022 10:33 PM | Updated on Mar 27 2022 10:51 PM

YS Jagan Mohan Reddy Congrats PV Sindhu For Winning Swiss Open 2022 - Sakshi

సాక్షి, అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ 2022 ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింధును అభినందించారు. ''స్విస్‌ ఓపెన్‌ గెలిచిన పీవీ సింధుకు కంగ్రాట్స్‌. మన జాతి గర్వించేలా చేశావు. ఈ సందర్భంగా ఆమెను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు చేరిన తెలుగు తేజం.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌ షట్లర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌పై 21–16, 21–8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్‌లో రెండో సింగల్స్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement