చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. రైనా ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు | Virat Kohli becomes most PoTM award for India in Asia Cup | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. రైనా ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Sep 12 2023 7:29 AM | Updated on Sep 12 2023 8:34 AM

Virat kohli becomes Most PoTM award for India in ODI Asia Cup - Sakshi

ఆసియాకప్‌ 2023 సూపర్‌-4లో దయాది పాకిస్తాన్‌కు టీమిండియా తన పవర్‌ ఎంటో చూపించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 228 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో రోహిత్‌ సేన సత్తాచాటింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (94 బంతుల్లో 122 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (106 బంతుల్లో 111 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకాలతో చెలరేగారు. వీరిద్దరితో పాటు ఓపెనర్‌లు శుబ్‌మన్‌ గిల్‌(58), రోహిత్‌ శర్మ(56) పరుగులతో రాణించారు.

కుల్దీప్‌ యాదవ్‌ మయాజాలం..
ఇక అనంతరం పాక్‌ 32 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. గాయాల కారణంగా రవూఫ్, నసీమ్‌ షా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో 8 వికెట్లకే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌలింగ్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన స్పిన్‌ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశాడు. 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్దీప్‌.. 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు బుమ్రా, శార్థూల్‌ ఠాకూర్‌, హార్దిక్‌ పాండ్యా తలా వికెట్‌ సాధించారు.

విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లికి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. తద్వారా కింగ్‌ కోహ్లి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియాకప్‌ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సార్లు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు 4 సార్లు కోహ్లి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు.

అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా, నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉండేది. ఆసియాకప్‌ వన్డే టోర్నీ చరిత్రలో వీరిద్దరూ మూడు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరి రికార్డును విరాట్‌ బ్రేక్‌ చేశాడు.
చదవండి: Ind vs Pak Kohli Century: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement