తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం..! | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం..!

Published Mon, Apr 8 2024 12:06 PM

Tamil Nadu CM Stalin Announces Development Of New Cricket Stadium In Coimbatore - Sakshi

తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ (డీఎంకే) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్‌ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్‌  స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. 

క్రికెట్ ఔత్సాహికుడినైన నేను #Elections2024 కోసం మా ఎన్నికల మేనిఫెస్టోలో మరో వాగ్దానాన్ని జోడించాలనుకుంటున్నాను. కోయంబత్తూరులోని క్రీడాభిమానుల చురుకైన భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఈ స్టేడియాన్ని చెన్నై చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ వేదికగా తీర్చిదిద్దుతాను.  క్రీడల మంత్రి ఉదయ్‌ స్టాలిన్ రాష్ట్రంలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాడంటూ స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. 

కాగా, తమిళనాట ఇదివరకే ఓ అంతర్జాతీయ స్టేడియం (చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం) ఉందన్న విషయం తెలిసిందే. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది సొంత మైదానం. 1916లో స్థాపించబడిన చిదంబరం స్టేడియం దేశంలో రెండో పురాతన క్రికెట్‌ స్టేడియం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement