T20 WC PAK Vs WI: 'ముసలివాడివయ్యావు'.. బాబర్‌ అజమ్‌ ట్రోల్‌

T20 World Cup 2021: Babar Azam Troll Shadab Khan Vs WI Warm-Up Match - Sakshi

T20 WC 2021 Babar Azam Troll Shadab Khan.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సోమవారం పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ను షాహిన్‌ అఫ్రిది వేశాడు. ఓవర్‌ రెండో బంతిని లెండి సిమ్మన్స్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ ఆడాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న ఆండ్రీ ఫ్లెచర్‌ సింగిల్‌కు కాల్‌ ఇయ్యడంతో సిమ్మన్స్‌ పరిగెత్తాడు.

చదవండి: T20 WC IND vs PAK: బాబర్‌ అజమ్‌ బ్యాటింగ్‌.. రెప్పవాల్చని టీమిండియా

అయితే రనౌట్‌కు అవకాశం ఉన్నప్పటికీ గల్లీ నుంచి వేగంగా పరిగెత్తుకు వచ్చిన షాదాబ్‌ ఖాన్‌ డైరెక్ట్‌ హిట్‌ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో  పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ షాదాబ్‌ను ట్రోల్‌ చేస్తూ పలికిన మాటలు నవ్వులు పూయించాయి. '' నువ్వు ముసలివాడివి అయిపోయావు.. యంగ్‌గా ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా రనౌట్‌ చేసేవాడివి'' అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 130 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయి 27 బంతులు మిగిలిఉండగానే విజయాన్ని అందుకుంది. బాబర్‌ అజమ్‌ (41 బంతుల్లో 50 పరుగులు; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. ఫఖర్‌ జమాన్‌ (24 బంతుల్లో 46 పరుగులు; నాలుగు  ఫోర్లు, 2 సిక్సర్లు)తో అతనికి సహకరించాడు.

చదవండి: T20 World Cup: ఇండియా- పాక్‌ మ్యాచ్‌ రద్దు చేసే వీలు లేదు.. ఆడాల్సిందే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top