నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. సెమీస్‌లో విఫలమైన షఫాలీ.. తుది పోరులో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తనదైన షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. స్మృతి మంధానతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మంధానతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన షఫాలీ వర్మ.. ఆ తర్వాత రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.
ఓ దశలో సునాయసంగా సెంచరీ చేసేలా కన్పించిన ఈ విధ్వంసకర ఓపెనర్, భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయింది. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87 పరుగులు చేసింది. కాగా వాస్తవానికి వరల్డ్ కప్ జట్టులో షఫాలీ వర్మకు చోటు లేదు.
స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో.. షఫాలీకి సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. తనకు లభించిన అవకాశాన్ని ఈ హర్యానా క్రికెటర్ అందిపుచ్చుకుంది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో షఫాలీ వర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.
ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా షఫాలీ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ప్లేయర్ పూనమ్ రౌత్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ ఫైనల్లో పూనమ్ 86 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో పూనమ్ ఆల్‌టైమ్ రికార్డును వర్మ బ్రేక్‌చేసింది.
చదవండి: IND vs AUS: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! ఒంటి చేత్తో గెలిపించాడు
A shot that leaves you going 😯😳🤯
We’re witnessing vintage #ShafaliVerma, delivering on the grandest stage, just when it matters the most! 👏🏻👍🏻
#CWC25 Final 👉 #INDvSA, LIVE NOW 👉 https://t.co/gGh9yFhTix pic.twitter.com/1mwc8WsLH9— Star Sports (@StarSportsIndia) November 2, 2025


