రోహిత్‌ ‘బౌలింగ్‌’ మార్చాడు!

Rohit Sharma Bowls Medium Pace After Navdeep Saini Leaves - Sakshi

బ్రిస్బేన్‌: రోహిత్‌ శర్మ.. రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌గా, హిట్‌మ్యాన్‌గా మనకు పరిచయం. అప్పడప్పుడు బౌలింగ్‌ కూడా వేస్తూ ఉంటాడు రోహిత్‌. వన్డేల్లో 8 వికెట్లు,  టెస్టుల్లో రెండు వికెట్లు,  అంతర్జాతీయ టీ20ల్లో వికెట్‌
సాధించాడు రోహిత్‌. కాగా, ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన రోహిత్‌ ఎప్పుడో గానీ బౌలింగ్‌ వేయడు. పార్ట్‌టైమ్‌ బౌలర్‌ కావడంతో రోహిత్‌కు బౌలింగ్‌ వేసే అవకాశాలు చాలా తక్కువ. కాగా, ఇలా బౌలింగ్‌ వేసే అవకాశం రోహిత్‌కు మళ్లీ  వచ్చింది.  ఆస్ట్రేలియాతో చివరిదైన నాల్గో టెస్టులో రోహిత్‌ బౌలింగ్‌ వేశాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా లబూషేన్‌ ఆడే క్రమంలో ఒక బంతి వేశాడు. ఒక బంతి వేయడం ఏమిటా అనుకుంటున్నారా.. ?  టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ గాయంతో 36 ఓవర్‌ ఆఖరి బంతిని వేయకుండా పెవిలియన్‌కు చేరడంతో ఆ బంతిని వేసే అవకాశం రోహిత్‌కు వచ్చింది. (స్మిత్‌ను పట్టేశారు.. లబూషేన్‌ను వదిలేశారు!)

అయితే కుడి చేతి ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన రోహిత్‌.. ఈసారి
మీడియా పేస్‌ వేశాడు. ఆఫ్‌ సైడ్‌కు వేసిన ఆ బంతిని లబూషేన్‌ పుష్‌ చేసి సింగిల్‌ తీశాడు. లబూషేన్‌కు అంతకుముందే లైఫ్‌ లభించింది.  సైనీ వేసిన 36 ఓవర్‌ ఐదో బంతికి క్యాచ్‌ ఇవ్వగా రహానే వదిలేశాడు.  
35వ ఓవర్‌లో స్మిత్‌ను సుందర్‌ ఔట్‌ చేస్తే, ఆ మరుసటి ఓవర్‌లో లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. 36 ఓవర్‌ ఐదో బంతికి లబూషేన్‌ గల్లీలో ఇచ్చిన స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌
క్యాచ్‌ను రహానే వదిలేశాడు.  దాంతో లబూషేన్‌కు లైఫ్‌ లభించగా, అసలు ఊహించిన ఈ పరిణామంతో రహానే కాస్త నిరాశ చెందాడు.

ఈ మ్యాచ్‌ ద్వారా నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 300వ టెస్టు ప్లేయర్‌గా నటరాజన్‌, 301వ టెస్టు ప్లేయర్‌గా సుందర్‌లు క్యాప్‌లు అందుకున్నారు. టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా
బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆదిలోనే వార్నర్‌(1), మార్కస్‌ హారిస్‌(5) వికెట్లను కోల్పోయిన ఆసీస్.. ఆపై  లంచ్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌(36) వికెట్‌ను చేజార్చుకుంది. వార్నర్‌ను సిరాజ్‌ ఔట్‌ చేస్తే, హారిస్‌ను శార్దూల్‌ 
పెవిలియన్‌కు పంపాడు. స్మిత్‌ వికెట్‌ను టెస్టు అరంగేట్రం బౌలర్‌ సుందర్‌ సాధించాడు.  ఇది సుందర్‌కు టెస్టుల్లో తొలి వికెట్‌. (లెఫ్టార్మ్‌ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top