Rahul Dravid: ద్రవిడ్‌ నిక్‌నేమ్‌ ఏంటో తెలుసా? నాడు పాకిస్తాన్‌ గడ్డపై డబుల్‌ సెంచరీతో మెరిసి..

Rahul Dravid Birthday: Interesting Facts Nickname Look At Best Innings - Sakshi

టీమిండియా దిగ్గజం, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జనవరి 11న 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు ఒక అడుగు దూరంలో నిలిచిన భారత జట్టు... విజయాన్ని ఆయనకు బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే హెడ్‌కోచ్‌గా స్వదేశంలో టీ20 సిరీస్‌ గెలుపుతో ప్రయాణాన్ని ఆరంభించిన ద్రవిడ్‌... దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టులో గనుక విజయం సాధిస్తే సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయం. ఇదిలా ఉంటే.. టెస్టు క్రికెటర్‌గా ద్రవిడ్‌ కెరీర్‌లోని మూడు అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను ఒకసారి పరిశీలిద్దాం.

ఆస్ట్రేలియా మీద ఈడెన్‌ గార్డెన్స్‌లో..
2000లో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. పర్యాటక ఆసీస్‌ గంగూలీ సేనను ఫాలో ఆన్‌ ఆడించిన తరుణంలో ద్రవిడ్‌, లక్ష్మణ్‌ కలిసి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. ఇద్దరూ కలిసి 386 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చివేశారు.

ఈ టెస్టులో లక్ష్మణ్‌ 280 పరుగులు చేస్తే... ద్రవిడ్‌ 180 పరుగులతో రాణించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్‌తో భారత్‌ 171 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టుపై గెలుపొందింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో కూడా నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకుంది.

అడిలైడ్‌లో 233 పరుగులు చేసి...
ఆస్ట్రేలియాతో 2003లో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో ఆతిథ్య జట్టు 566 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. విజయం ఖాయమనుకున్న సమయంలో లక్ష్మణ్‌- ద్రవిడ్‌ ద్వయం మరోసారి మ్యాజిక్‌ చేసింది. ద్రవిడ్‌ 233 పరుగులు చేయగా.. లక్ష్మణ్‌ 148 పరుగులు సాధించాడు. చేజారుతుందనుకున్న మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రావల్పిండిలో పాకిస్తాన్‌ మీద..
2004లో పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ దాయాది జట్టు మీద డబుల్‌ సెంచరీ సాధించాడు. 270 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో పాకిస్తాన్‌ గడ్డ మీద తొలి టెస్టు సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. 

చదవండి: West Indies Vs Ireland: క్రికెట‌ర్ల‌కు క‌రోనా.. నేటి మ్యాచ్ వాయిదా

హ్యాపీ బర్త్‌డే రాహుల్‌ ద్రవిడ్‌
1973.. జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జననం
తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చిన్నతనంలోనే బెంగళూరుకు
జామ్‌ కంపెనీలో పనిచేసిన ద్రవిడ్‌. అందుకే జామీ అనే నిక్‌నేమ్‌ ఉందన్న ద్రవిడ్‌ తండ్రి.
12 ఏళ్ల వయస్సులో కర్ణాటక తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఎంట్రీ
1991లో రంజీ ట్రోఫీలో ద్రవిడ్‌ అరంగేట్రం
1996లో శ్రీలంకతో వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం
అదే ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టెస్టుల్లో ఎంట్రీ
509 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 24,208 పరుగులు.. 48 సెంచరీలు
టీమిండియా కెప్టెన్‌గా సేవలు
ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌
2003లో విజేత పెండార్కర్‌తో ద్రవిడ్‌ వివాహం
ఈ జంటకు కుమారులు సమిత్‌, అన్వయ్‌ సంతానం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top