IPL 2021, MI vs SRH: SRH's Kane Williamson Given An update On His Injury, Is Kane Williamson Playing Tonight Against MI? - Sakshi
Sakshi News home page

కేన్‌ విలియమ్సన్‌ గాయంపై అప్‌డేట్‌

Apr 17 2021 6:39 PM | Updated on Apr 17 2021 8:01 PM

IPL 2021: SRH Kane Williamson Updates On His Injury - Sakshi

Photo Courtesy:IANS

చెన్నై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ముంబై ఇండియన్స్‌తో ఈరోజు చెపాక్‌లో జరుగనున్న మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.  ఒకవైపు ముంబై ఇండియన్స్‌ అత్యంత బలంగా ఉండటంతో ఆ జట్టును ఎలా నిలువరించాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. గత మ్యాచ్‌ల ఓటములను పక్కను పెట్టే ఫ్రెష్‌గా బరిలోకి దిగాలనుకుంటోంది. సన్‌రైజర్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేన్‌ విలియమ్సన్‌ లేకపోవడంపై ఆ జట్టుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కేన్‌ మామ లేని కారణంగానే రెండు మ్యాచ్‌లు ఓడిపోయామని అభిమానులు సదరు ఫ్రాంచైజీపై విమర్శలకు దిగారు.

కానీ విలియమ్సన్‌ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని, అందుచేత అతన్ని జట్టులో వేసుకోలేదని ఫ్రాంచైజీ సైతం వివరణ ఇచ్చింది. కాగా, విలియమ్సన్‌ ఇంకా ఫిట్‌ కాలేదట. ముంబైతో మ్యాచ్‌కు కూడా విలియమ్సన్‌ అందుబాటులో  ఉండటం లేదు.  ఈ విషయాన్ని  కేన్‌ విలియమ్సన్‌ తన మాటల ద్వారా స్పష్టం చేసిన ఒక వీడియోను విడుదల చేసింది సన్‌రైజర్స్‌. 'గాయం నయమవుతోంది. వారం రోజుల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించి బరిలోకి దిగుతా.  ప్రాక్టీస్‌కు బ్యాలెన్స్ పాటిస్తున్నా. అతి తర్వలోనే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో సిద్ధమవుతా’ అని తెలిపాడు. 

ఇక్కడ చదవండి: పాటలు పాడుతూనే ‘వీర’బాదుడు!
నన్ను చంపాలనే ప్రోగ్రామ్‌ పెట్టారా..?: రోహిత్‌‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement