Indian Super League: హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టుకు మూడో పరాజయం

Indian Super League: Odisha FC Beat Hyderabad Hyd In 2nd Place - Sakshi

భువనేశ్వర్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీ 3–1 గోల్స్‌తో హైదరాబాద్‌ను బోల్తా కొట్టించింది.

ఒడిశా తరఫున ఇసాక్‌ (33వ ని.లో), డీగో మౌరిసియో (90+4వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... హైదరాబాద్‌ ప్లేయర్‌ నిమ్‌ డోర్జీ తమాంగ్‌ 72వ నిమిషంలో ‘సెల్ఫ్‌ గోల్‌’ చేశాడు. హైదరాబాద్‌ నుంచి ఏకైక గోల్‌ను నిమ్‌ డోర్జీ (45వ ని.లో) సాధించాడు. 17 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ 11 విజయాలు, 3 ‘డ్రా’లు, 3 ఓటములతో 36 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది.    

చదవండి: Hyderabad E-Prix 2023 : రేసింగ్‌ @ హైదరాబాద్‌
Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్‌ అదిరిపోయే పంచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top