నేడు భారత్, వెస్టిండీస్ తొలి మ్యాచ్
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
లక్నో: వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకున్న భారత్ ఇప్పుడు టి20 మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన జట్టులోని దాదాపు అందరు సభ్యులు ఇప్పుడు మూడు రోజుల తర్వాత మరో టి20 మ్యాచ్ బరిలోకి దిగుతున్నారు. అంతర్జాతీయ క్యాలెండర్‌లో ప్రస్తుతం వన్డేలతో పోలిస్తే టి20లకు ప్రాధాన్యత లేకపోయినా... భారత్, విండీస్ ఐదు మ్యాచ్‌ల సమరంలో తలపడుతుండటం విశేషం. అయితే విండీస్‌లాంటి జట్టుతో ఈ ఫార్మాట్‌లో అభిమానులకు పూర్తి వినోదం ఖాయం.
ఆసియా క్రీడల ఫైనల్‌ను బట్టి చూస్తే భారత తుది జట్టులో కొన్ని మార్పులు ఖాయం. బుమ్రాను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు కాబట్టి అతని స్థానంలో అర్ష్ దీప్ ఆడతాడు. సొంత మైదానం కాబట్టి మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరిని ఎంపిక చేయడం ఖాయం. రెగ్యులర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు సామ్సన్‌లతో పాటు మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌కు తిరుగులేదు. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్, తిలక్‌ల నుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశిస్తోంది. మరో వైపు విండీస్‌ను టి20ల్లో అంచనా వేస్తే భంగపాటు తప్పదు. బౌలింగ్ ఘనంగా లేకపోయినా...బ్యాటింగ్‌తోనే ఆ జట్టు ప్రత్యరి్థపై ఆధిపత్యం ప్రదర్శించగలదు.


