నేటి నుంచి (జులై 23) ద హండ్రెడ్‌ లీగ్‌ ప్రారంభం | The Hundred Mens Competition 2024 Starts From July 23 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి (జులై 23) ద హండ్రెడ్‌ లీగ్‌ ప్రారంభం

Jul 23 2024 8:02 AM | Updated on Jul 23 2024 8:02 AM

The Hundred Mens Competition 2024 Starts From July 23

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే 'ద హండ్రెడ్‌ లీగ్‌' నేటి నుంచి ప్రారంభం కానుంది. లీగ్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌, బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ తలపడనున్నాయి. లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. ఆగస్ట్‌ 18న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

గత ఎడిషన్‌ ఫైనల్లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌.. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. లీగ్‌ తొలి ఎడిషన్‌లో (2021) సథరన్‌ బ్రేవ్స్‌, రెండో ఎడిషన్‌లో ట్రెంట్‌ రాకెట్స్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ లీగ్‌ 100 బంతుల ఫార్మాట్‌లో నడుస్తుంది. ఓవర్‌కు ఐదు బంతులు ఉంటాయి. ప్రతి బౌలర్‌ రెండు ఓవర్లు వేయవచ్చు.

జట్ల వివరాలు..
లండన్‌ స్పిరిట్‌: జాక్‌ క్రాలే, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, డేనియల్‌ లారెన్స్‌, డేనియల్‌ బెల్‌ డ్రమ్మండ్‌, రవి బొపారా, జేమ్స నీషమ్‌,మాథ్యూ క్రిచ్లీ, ఆండ్రీ  రసెల్‌, లియామ్‌ డాసన్‌, మైకేల్‌ కైల్‌ పెప్పర్‌, ఆడమ్‌ రొస్సింగ్టన్‌, ఓలీ పోప్‌, డేనియల్‌ వార్రల్‌, నాథన్‌ ఇల్లిస్‌, రిచర్డ్‌ గ్లీసన్‌, ఓలీ స్టోన్‌, ఎండీ టేలర్‌, ర్యాన్‌ హిగ్గిన్స్‌

నార్త్రన్‌సూపర్‌ ఛార్జర్స్‌: ఆడమ్‌ హోస్‌, హ్యారీ బ్రూక్‌, గ్రహమ్‌ క్లార్క్‌, మిచెల్‌ సాంట్నార్‌, బెన్‌ స్టోక్స్‌ టామ్‌ లవెస్‌, మాథ్యూ షార్ట్‌, జేసన్‌ రాయ్‌, జోర్డన్‌ క్లార్క్‌, నికోలస్‌ పూరన్‌, పాట్రిక్‌ బ్రౌన్‌, ఓలీ రాబిన్సన్‌, కల్లమ్‌ పార్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌, ఆదిల్‌ రషీద్‌, మాథ్యూ పాట్స్‌, డిల్లన్‌ పెన్నింగ్టన్‌, రీస్‌ టాప్లే, బెన్‌ డ్వార్షుయిస్‌

బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌: బెన్‌ డకెట్‌, మొయిన్‌ అలీ, రిషి పటేల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, సీన్‌ అబాట్‌, క్రిస్‌ వోక్స్‌, బెన్నీ హోవెల్‌, డాన్‌ మౌస్లీ, జేకబ్‌ బేతెల్‌, లూయిస్‌ కింబర్‌, జేమీ స్మిత్‌, అనెరిన్‌ డొనాల్డ్‌, టమ్‌ హెల్మ్‌, ఆడమ్‌ మిల్నే, జేమ్స్‌ ఫుల్లర్‌, టిమ్‌ సౌథీ

వెల్ష్‌ ఫైర్‌: గ్లెన్‌ ఫిలిప్స్‌, టామ్‌ ఏబెల్‌, బెన్‌ గ్రీన్‌, జో క్లార్క్‌, జానీ బెయిర్‌స్టో, లూక్‌ వెల్స్‌, డేవిడ్‌ విల్లే, టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌, స్టెఫెన్‌ ఎస్కినాజీ, క్రిస్‌ వోక్స్‌, హరీస్‌ రౌఫ్‌, డేవిడ్‌ పేన్‌, మేసన్‌ క్రేన్‌, వాన్‌ డర్‌ మెర్వ్‌, మ్యాట్‌ హెన్రీ, జేక్‌ బాల్‌

సథరన్‌ బ్రేవ్‌: డేనియల్‌ హ్యూస్‌, జేమ్స్‌ విన్స్‌, లారీ ఈవాన్స్‌, కీరన్‌ పోలార్డ్‌, రెహాన్‌ అహ్మద్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌, ఫిన్‌ అలెన్‌, డు ప్లూయ్‌, జో వెథర్లీ, అలెక్స్‌ డేవిస్‌, జేమ్స్‌ కోల్స్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ జోర్డన్‌, టైమాల్‌ మిల్స్‌, అకీల్‌ హొసేన్‌, డానీ బ్రిగ్స్‌, జార్జ్‌ గార్టన్‌

ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌: రవాండ ముయేయే, టామ్‌ లామ్మన్బీ, విల్‌ జాక్స్‌, సామ్‌ కర్రన్‌, టామ్‌ కర్రన్‌, హ్యరీసన్‌ వార్డ్‌, డేవిడ్‌ మలాన్‌, జోర్డన్‌ కాక్స్‌,సామ్‌ బిల్లంగ్స్‌, డొనొవన్‌ ఫెరియెరా, సకీబ్‌ మహమూద్‌, మర్చంట్‌ డి లాంజ్‌, ఆడమ్‌ జంపా, మొహమ్మద్‌ ఆమిర్‌, నాథన్‌ సౌటర్‌, మార్క్‌ వాట్‌

ట్రెంట్‌ రాకెట్స్‌: రోవ్‌మన్‌ పావెల్‌, జో రూట్‌, సామ్‌ హెయిన్‌, రషీద్‌ ఖాన్‌, లూయిస్‌ గ్రెగరీ, ఆడమ్‌ లిథ్‌, అలెక్స్‌ హేల్స్‌, ఇమాద్‌ వసీం, జోర్డన్‌ థాంప్సన్‌, టామ్‌ అల్సోప్‌, టామ్‌ బాంటన్‌,ఓలీ రాబిన్సన్‌, జాన్‌ టర్నర్‌, రిలే మెరిడిత్‌, లూక్‌ వుడ్‌, సామ్‌ కుక్‌, కల్విన్‌ హ్యారీసన్‌

మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌: థామన్‌ అస్పిన్‌వాల్‌, మ్యాక్స్‌ హోల్డన్‌, సికందర్‌ రజా, స్కాట్‌ కర్రీ, పాల్‌ వాల్టర్‌, జేమీ ఓవర్టన్‌, వేన్‌ మ్యాడ్‌సన్‌, మాథ్యూ హర్స్ట్‌, జోస్‌ బట్లర్‌, ఫిలిప్‌ సాల్ట్‌, సోనీ బేకర్‌, ఉసామా మిర్‌, మిచెల్‌ స్టాన్లీ, టామ్‌ హార్ట్లీ, జోష్‌ హల్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ

Advertisement
 
Advertisement
Advertisement