ఆర్సీబీ ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా | Australia Women beat Bangladesh Women by 9 wkts | Sakshi
Sakshi News home page

BAN vs AUS: ఆర్సీబీ ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

Oct 11 2026 3:29 PM | Updated on Oct 11 2026 3:29 PM

Australia Women beat Bangladesh Women by 9 wkts

బ్రిస్బేన్ వేదిక‌గా బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మ‌రో మ్యాచ్ మిగిలుండ‌గానే మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ అమ్మాయిలు సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు సాధించింది. 

టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శోభనా మోస్తరీ (134 బంతుల్లో 118, 18 ఫోర్లు) అద్భుతమైన సెంచ‌రీతో క‌దం తొక్కింది. ఆమెతో పాటు కెప్టెన్ నిగార్ సుల్తానా (114 బంతుల్లో 74 , 7 ఫోర్లు) కీల‌క ఇన్నింగ్స్ ఆడింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో మేగన్ షట్ నాలుగు వికెట్ల‌తో స‌త్తాచాట‌గా.. కిమ్ గార్త్ ఓ వికెట్ ప‌డ‌గొట్టింది.

జార్జియా వోల్ సూప‌ర్ సెంచ‌రీ
అనంత‌రం 221 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవ‌లం  28.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఊదిప‌డేసింది. ఓపెన‌ర్ జార్జియా వోల్ (97 బంతుల్లో 131, 19 ఫోర్ల‌తో) అజేయ సెంచ‌రీతో మ్యాచ్‌ను ముగించింది. ఆమెతో పాటు మ‌రో ఓపెన‌ర్ లిచ్‌ఫీల్డ్ 70 ప‌రుగుల‌తో రాణించింది.

కాగా జార్జియా వాల్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్సీబీ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక  ఇరు జ‌ట్ల మ‌ధ్య నామ‌మాత్ర‌పు మూడో వ‌న్డే బుధ‌వారం బ్రిస్బేన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.
చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేస్తున్నాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement