Asian Para Games 2026: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం | Asian Para Games 2026 Day 3: Sachin Khilari Claims Gold As India Sweep Podium In Mens Shot Put F46 | Sakshi
Sakshi News home page

Asian Para Games 2026: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

Oct 21 2026 9:17 AM | Updated on Oct 21 2026 10:37 AM

Asian Para Games 2026 Day 3: Sachin Khilari Claims Gold As India Sweep Podium In Mens Shot Put F46

source: X

ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. మూడో రోజు పోటీల్లో సచిన్ ఖిలారీ స్వర్ణ పతకంతో మెరిశాడు. పురుషుల షాట్‌పుట్‌ F46 విభాగంలో 15.87 మీటర్ల దూరం విసిరి గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. ఇదే విభాగంలో భారత్‌కు చెందిన మహ్మద్ యాసర్ (15.06 మీ), పర్వీన్ (14.94 మీ) రజత, కాంస్య పతకాలు సాధించారు. దీంతో భారత్ పోడియంపై మూడు స్థానాలనూ కైవసం చేసుకుంది.

హైజంప్‌లోనూ స్వర్ణం, రజతం
పురుషుల హైజంప్‌ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ 2.05 మీటర్ల ఎత్తు దూకి గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకం గెలిచాడు. భారత అథ్లెట్ బంటీ 1.92 మీటర్లతో రజతం సాధించాడు. ఈ విభాగంలోనూ భారత్ రెండు పతకాలను సొంతం చేసుకుంది.

మూడో రోజు భారత్‌కు మరిన్ని పతకాలు
పురుషుల షాట్‌పుట్‌ F53 విభాగంలో ఆయుష్ వర్మ 8.16 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం గెలిచాడు. మహిళల కాంపౌండ్ డబుల్స్‌లో షీతల్ దేవి, పాయల్ నాగ్ జోడీ రజత పతకం సాధించింది.

మొదటి రెండు రోజుల్లోనే 35 పతకాలు సాధించిన భారత్.. మూడో రోజు విజయాలతో ఆసియా పారా గేమ్స్‌లో తన పతకాల వేటను కొనసాగిస్తోంది.

ఇదీ చదవండి: Asian Para Games 2026: చరిత్ర సృష్టించిన నిషద్‌.. లాంగ్‌ జంప్‌, హైజంప్‌లో స్వర్ణ పతకాలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement