హ్యాట్రిక్ కోసం అభిషేక్ బెనర్జీ.. మళ్ళీ అక్కడ నుంచే పోటీ | TMC Abhishek Banerjee Nomination Files From Diamond Harbour in West Bengal | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ కోసం అభిషేక్ బెనర్జీ.. మళ్ళీ అక్కడ నుంచే పోటీ

May 10 2024 3:07 PM | Updated on May 10 2024 3:10 PM

TMC Abhishek Banerjee Nomination Files From Diamond Harbour in West Bengal

కోల్‌కతా: దేశంలో ఇప్పటికే మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 'అభిషేక్ బెనర్జీ' పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈయన కాళీఘాట్ నుంచి నడిచి.. అలీపూర్‌లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

నామినేషన్ దాఖలు చేసిన తరువాత తృణమూల్‌ కాంగ్రెస్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి 'అభిషేక్‌ బెనర్జీ' మాట్లాడుతూ.. డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ సాధించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement