కేజీ టు పీజీ విద్య ఏమైంది : జీవన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కేజీ టు పీజీ విద్య ఏమైంది : జీవన్‌రెడ్డి

Published Thu, Dec 17 2020 3:15 PM

MLC Jeevan Reddy Says There Is Shortage In Education Department  - Sakshi

సాక్షి, జగిత్యాల : తెలంగాణలో విద్యాశాఖ అధికారల కొరత ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.ప్రస్తుతం కేజీ టు పీజీ వరకు ఆంగ్ల భాషలో బోధన ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారని, విద్యార్ధుల్లో చైతన్యం నింపిన ఘనత వారిదేనన్నారు. గత ఆరు సంవత్సరాల కాలంలో పదవీవిరమణ పొందిన ఉపాద్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. పదోన్నతులు పొందడం ఉపాధ్యాయుల హక్కు అని, ప్రభుత్వం ఉపాద్యాయులుకు వెంటనే పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. పోస్టులు భర్తీ చేయకుండా విద్యావాలంటరీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement