జిలెటెన్‌స్టిక్స్‌ పట్టివేత | Sakshi
Sakshi News home page

జిలెటెన్‌స్టిక్స్‌ పట్టివేత

Published Mon, Mar 25 2024 1:15 AM

పేలుడు పదార్థాలు కోసం వినియోగించే  కంప్రెషర్‌ ట్రాక్టర్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు
 - Sakshi

పేలుడు పదార్థాల రవాణా చేస్తున్న వ్యక్తి కేసు

చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం రామారావుపల్లె శివారులోని మామిడితోటలో డిటోనేటర్లు, జిలెటెన్‌స్టిక్స్‌ను చందుర్తి పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు. మండలంలోని రామారావుపల్లి–సనుగుల మధ్య మామిడితోటలో పేలుడు పదార్థాలను అక్రమంగా నిలువ ఉంచారన్న సమాచారంతో దాడులు చేశారు. మామిడితోటలో డిటోనేటర్లు, జిలెటెన్‌స్టిక్స్‌ డంప్‌ చేశారన్న సమాచారంతో పోలీసులు రెండు గంటలకుపైగా గాలించారు. మామిడితోటలోని మామిడిచెట్టు కింద సంచిలో లభించిన పేలుడు పదార్థాలను బాంబుస్క్వాడ్‌ సిబ్బంది పరిశీలించి, డాగ్‌స్క్వాడ్‌తో గాలించారు. పోలీసులకు 24 డిటోనేటర్లు, 16 జిలెటిన్‌స్టిక్స్‌, డైనమో, బైండింగ్‌ వైరు, కంప్రెషర్‌ ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న కొమిరే మల్లయ్యపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement