
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు.
సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్‌కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్‌ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం.